నామినేషన్ వేశారు.. కానీ, గెలుస్తామన్న ధీమా అయితే కనిపించడం లేదు. అదే.. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి! ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ వేశారు. స్థానికంగా పట్టున్న నాయకుడే అయినా.. ఇప్పుడున్న కూటమి హవా ముందు ఆయన ఎలా ముందుకు సాగుతారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఈ ఉప ఎన్నిక ప్రజలకు సంబంధించింది కాదు! కేవలం స్థానిక సంస్థల పరిదిలోని ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నిక.
ప్రస్తుతం స్థానిక సంస్థల పరంగా చూస్తే.. విశాఖ నగరపాలక సంస్థ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు.. ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లు కూడా కీలకం. వీరిలో మెజారిటీ అంటే..సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్ల బలం వైసీపీకి ఉంది. కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు మాత్రం తమకు అను కూలంగా లేవు. అవి కూటమివైపు ఉన్నాయి. పైగా తమ గూటిని కూడా ఆక్రమించుకునేందుకు కూటమి పార్టీల సీనియర్లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా యి. పైగా.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వైసీపీ క్యాంపునకు తరలించింది. అయినా.. కొందరు పార్టీకి దూరంగా ఉంటూ.. కూటమి నాయకులకు టచ్‌లో ఉన్నారు.
ఈ పరిణామమే కూటమి ప్రభుత్వానికి లేని బలం తెచ్చి పెడుతుండగా.. వైసీపీలో మాత్రం గుబులు రేపుతోంది. దీంతో వైసీపీ నాయకులు అలెర్ట్ అయ్యారు. పార్టీ అదినేత జగన్ కూడా అక్కడి వారితో టచ్‌లో ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్ వారితో తరచుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ.. కూటమి నాయకులు చేస్తున్న దూకుడుతో వైసీపీకి ఇబ్బందిగానే మారింది. ఇదిలావుంటే.. అసలు బలం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ.. ఇటవీల విశాఖ కార్పొరేషన్‌లో స్టాండింగ్ కమిటీని కూటమి ప్రభుత్వం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే దూకుడుతో.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలోనూ విజయం దక్కించుకోవాలన్నది వీరి భావన. అయితే.. ఆరు వందల మందికిపైగా తమ ఓటర్లు ఉన్నందున బొత్స విజయం ఖాయమని వైసీపీ భావిస్తోంది.
కూటమి అభ్యర్థి ఎవరు?
వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. సోమవారం ఆయన నామినేషన్ కూడా వేశారు. ఇప్పు డు కూటమి తరఫున బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు అయినట్టు తెలిసింది. మంగళవారంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరుకు తెర పడనుంది. దీంతో ఆఘమేఘాలపై కూటమి నాయకులు దిలీప్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే.. ఇంకా ఈ పేరును అధికారికంగా ఖరారు చేయలేదు. అయినప్పటికీ బైరా దిలీప్ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ వర్సెస్ కూటమి మధ్య ఈ ఉప పోరు.. ఎవరికి మేలు చేస్తుందో చూడాలి. కాగా, ఎవరు గెలిచినా.. మూడున్నరేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉండనున్నారు.
This post was last modified on August 13, 2024 9:59 am
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…