ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హవాకు బ్రేకులు వేయాలన్న కొందరు నేతల ప్రయత్నాలు ఇప్పటికైతే ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో షర్మిల తన సొంత అజెండాను అమలు చేశారని, ఆమె క్షేత్రస్థాయిలో పరిణామాలను, పరిస్థితులను అంచనా వేయకుండా.. తన ఇష్టానుసారం వ్యవహరించారని దీంతో పార్టీకి ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆరోపిస్తూ.. రాష్ట్రానికి చెందిన నాయకులు ఫిర్యాదులు చేశారు. వీరిలో కొందరు మహిళా నాయకులు కూడా ఉన్నారు.
అయితే.. వాటిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. పక్కన పెట్టింది. పైగా ఫిర్యాదులు చేసిన వారినే పార్టీ నుంచి తప్పించింది. ఇక, ఇప్పుడు షర్మిల సుమారు 60 మంది నేతల జాబితాతో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో ని పలు కీలక పదవులు, జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసి.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని డెవలప్ చేయాలన్నది ఆమె వ్యూహం. వాస్తవానికి రాష్ట్ర పార్టీపై జాతీయ నాయకుల ముద్ర ఉంటుంది. అందుకే.. క్షేత్రస్థాయిలో ఒకప్పుడు పార్టీ అధిష్టానాన్నిమెప్పించి సొంతంగా పదవులు తెచ్చుకున్నారు.
అయితే..ఇప్పుడు మాత్రం క్షేత్రస్థాయి నుంచి నాయకులు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. ఎవరూ వెళ్లి.. అధిష్టానాన్ని రహస్యంగా కలుసుకున్నది కూడాలేదు. అంతా షర్మిల చేత, షర్మిల వలన.. అన్నట్టు గానే ఏపీ కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కానీ, ఆమె దూకుడు వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచిన స్థాయిలోను, వ్యక్తిగతంగా ఆమెకు వచ్చిన మార్కుల స్థాయిలోనూ.. పార్టీకి రాలేక పోయాయి. ఇది వాస్తవం. భారీ ఎత్తున 20-30 శాతం స్థాయిలో ఓటు బ్యాంకు పెరుగుతుందని అనుకున్నా రాలేదు.
ఈ క్రమంలో షర్మిల విఫలమైందన్న వాదన సొంత గూటి నుంచి సుంకర పద్మశ్రీ వంటి వారు.. పళ్లం రాజు వంటి సీనియర్లు వినిపించినా.. ఫలించడం లేదు. తనకు పార్టీ పగ్గాలు ఇచ్చి ముచ్చటగా మూడు మాసాలే అయిందని.. అయినా తాను దూకుడుగానే ఉన్నానని షర్మిల చెప్పుకొంటున్నారు. దీనిని అధిష్టానం కూడా పరిగణనలోకి తీసుకుంది. సో.. ఏపీలో ఏర్పాటు చేసే కమిటీలు, ఇతర పార్టీ కీలక పదవుల విషయంలో షర్మిలదే ఫైనల్ నిర్ణయం కావొచ్చని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా.. రఘువీరారెడ్డి పేరు వినిపిస్తుండడం గమనార్హం. షర్మిల ఈ పేరును ప్రపోజ్ చేశారని, దీనికి పార్టీ కూడా ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on August 12, 2024 12:13 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…