తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నారైలకు చోటు దక్కనుందా? టీటీడీ బోర్డులో ఎన్నారైలను నియ మించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. ఎన్నికలకు ముందు ఎన్నారైలు తరలి వచ్చి పార్టీ కోసం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం బాగానే కష్టించారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. వీరు సాధారణ పదవులతో సంతృప్తి చెందే పరిస్థితి లేదు.
నిజానికి చిన్న చిన్న పదువుల, నామినెట్ పదవులు ఇచ్చినా.. వారికి ఆసక్తి లేదు. నలుగురు నుంచి ఐదు గురు వరకు కీలక ఎన్నారైలు.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన మాటను చంద్రబాబు కాదనలేరు. ఇక, మిగిలిన వారిలో కోమటి జయరాం వర్గీయులుగా ఉన్న ఇద్దరు కూడా లైన్‌లో ఉన్నారని సమాచారం.
జయరాం చెబితే చంద్రబాబు కూడా కాదనే పరిస్థితి లేదు. అదేవిధంగా.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక ఎమ్మెల్యే సతీమణి కూడా ఈ రేసులో ఉన్నారన్నది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. పైకి పేరు చెప్పకపోయినా.. ఆమె పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం గా నలుగురు నుంచి ఐదుగురు ఎన్నారైలకు బోర్డులో సభ్యత్వం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. ఇలా ఎప్పుడూ ఎన్నారైలకు టీటీడీ బోర్డులో సభ్యత్వాలు ఇవ్వలేదు.
కానీ, ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఆ నలుగురు ఐదుగురిని కూడా ఎక్స్ అఫిషి యో సభ్యులుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుంటే.. సినీ రంగం నుంచి మురళీ మోహన్ కూడా బోర్డులో సభ్యుడు కానున్నట్టు సమాచారం.
ఆయన వాస్తవానికి చైర్మన్ పదవిని కోరుకు న్నా.. ఓ మీడియా అధినేత పేరు ముందుకు రావడంతో ఆయన వెనక్కి తగ్గారని తెలిసింది. త్వరలోనే బోర్డు చైర్మన్ సహా సభ్యులను నియమించనున్నారని, ఇదంతా కూడా.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముందే జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పాటులో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి…
https://www.youtube.com/watch?v=UKsYG86wuRY హీరోతో టాలీవుడ్ కు పరిచయమైన అశోక్ గల్లా డెబ్యూతో ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో రెండో సినిమాకు బాగా గ్యాప్…
ఏపీ కలల రాజధాని అమరావతికి నిధుల అడ్డంకులు దాదాపు తొలిగిపోయాయి. అటు రుణం రూపంలో కొంత.. ఇటు బడ్జెట్ కేటాయింపులు…
ఏపీ అసెంబ్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేయడం తో రాత్రికి రాత్రి…
పిల్లి సాధు జంతువే. ఎంతో ముచ్చటగా ఉంటుంది. మనం చెప్పినట్టు చేస్తుంది. కానీ, దానిని బంధిస్తే.. ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు…
వైసీపీ నాయకులకు ఒకవైపు సోషల్ మీడియా కామెంట్లు, పోస్టుల చిక్కులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చెలరేగిన వారిని అరెస్టు చేస్తున్న…