అధికారంలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యకు వచ్చేందుకు ఉత్సాహం చూపించే నాయకుడు ఒకరు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యకు వచ్చేందుకు జంకేవారు మరొకరు. మీన మేషాలు లెక్కించే వారు మరొకరు. వారే.. ఒకరు సీఎం చంద్రబాబు, మరొకరు మాజీ సీఎం జగన్. వీరిద్దరి మధ్య తేడా ఇదే. తనకు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే దక్కారని ఆవేదన ఉన్నా.. చంద్రబాబు త్వరగా కోలుకుని.. వెంటనే ప్రజల మధ్యకు వచ్చారు. ప్రజలతోనే ఉన్నారు. చివరకు.. ప్రజల మనిషిగానే జీవించారు.
ఇక, జగన్ విషయాన్ని తీసుకుంటే.. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా.. జనాలను కలుసుకోలేదు. కలుసుకున్నా.. అనేక నిర్బంధాల మధ్య ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. పరదాలు కట్టించుకోవడం, చెట్లు నరికించడం, ప్రత్యర్థులను గృహ నిర్బంధాలు చేయడం వంటివి కొనసాగించారు. అది కూడా పెద్దగా లేదు. ఇక, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ఇచ్చినా తర్వాత.. అసలు ప్రజలను కలుసుకునేందుకు కూడా ఇష్టపడడం లేదు.
మరి చంద్రబాబు ఎందుకు అప్పుడు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రజల మధ్యే ఉంటున్నారనేది ప్రశ్న. ప్రజలకు ఏం చేశామన్నది ముఖ్యమే. అయితే.. వారి మధ్య ఉన్నామన్నది మరింత ముఖ్యం. ఇదొక స్వాంతన. ఓదార్పు. అదే కీలక సూత్రాన్ని చంద్రబాబు అనుసరించారు. తాను చేసింది చెప్పుకొనేందుకు.. చేయాల్సింది చెప్పుకొనేందుకు ప్రజల మద్యే ఆయన ఉన్నారు. తాజాగా చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసింది ఏమీ లేదు.
కానీ, వారి మధ్యే ఉన్నారు. నేతన్నలను కలుసుకున్నారు. వారికి ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వారికి లక్షల సొమ్ము కానుకగా కూడా ఇవ్వలేదు. కానీ, తాను స్వయంగా వెళ్లివారిని కలుసుకున్నారు. రెండు చీరలు కొన్నారు. దీంతో చంద్రబాబు హైలెట్ అయ్యారు. కానీ, జగన్ హయాంలో చేనేత దినోత్సవం నాడు నేతన్న నేస్తం కార్యక్రమాన్ని అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల మందికి రూ.18000 చొప్పున సాయం చేశారు. కానీ, ఇదంతా తాడేపల్లి నుంచే చేసేశారు.
ఫలితంగా ఆయనకు ప్రచారం లభించలేదు. అదే.. ఆయన ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. నేతన్నల మధ్య ఉండి ఉంటే.. ఆ కిక్కు వేరేగా ఉండేది. మొత్తానికి అటు చంద్రబాబుకు, ఇటు జగన్‌కు తేడా ఇదే! విషయం ఏదైనా ప్రజల మధ్య ఉంటే కొన్ని అపోహలు తొలిగిపోతాయి. ఈ చిన్న లాజిక్కును కూడా జగన్ మిస్ చేసుకున్నారు.
This post was last modified on August 9, 2024 9:31 am
ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీని ఏలిన లెజెండరీ డైరెక్టర్ శంకర్.. కొన్నేళ్లుగా ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. ఐ,…
ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం…
ఎంత రాజమౌళి ప్యాన్ ఇండియా మూవీ ఆలస్యమవుతుందని తెలిసినా అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు డిస్ట్రిబ్యూటర్లు ఆపడం…
కన్నతల్లిని మోసం చేసిన రాజకీయ నాయకుడిగా జగన్ కొత్త చరిత్ర సృష్టించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్, జగన్ సోదరి…
ఆగస్ట్ 14 రజనీకాంత్ కూలి విడుదలవ్వడం ఖాయమనే వార్త చెన్నై మీడియా వర్గాల్లో ఒక్కసారిగా గుప్పుమనడంతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల భూముల విషయంపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీనిపై…