సమాజంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం తరఫున ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు రక్తదానం ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించేవి. ఇప్పుడు కూడా రక్త దానం చేసే ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలానే ఇప్పుడు అవయవ దానం చేసేవారికి ఏపీ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.
అవయవాలు అవసరమైన వారు.. అవిలేక.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె వంటి వాటి కోసం.. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరికి బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వాటిని తీసుకుని అమర్చుతున్న పరిస్థితిని తరచుగా మనం గమనిస్తున్నాం. అయితే.. ఇది అధికారికం కాదు. సదరు వ్యక్తి ఇష్టాను సారం మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అధికారికం చేయలేదు. అయితే.. ప్రోత్సహించేందుకు మాత్రం సరికొత్త పంథాను ఎంచుకుంది.
విధి వశాత్తూ.. మరణిస్తూ.. అవయవాలను దానం చేసిన వారి మృత దేహాలకు సముచిత గౌరవంతో సర్కా రు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రబుత్వం నిర్ణయించింది. అంటే.. అవయవ దాతల అంతిమ సంస్కారాలను ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా…. వారికి పునర్జన్మ కల్పించనున్నారు.
ఇలా ఇచ్చే కార్యక్రమానికి ‘జీవన్‌దాన్’ గా పేరు పెట్టారు. అవయవ దాతల అంతిమ సంస్కారాలను సబ్ కలెక్టర్ స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో.. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అదేవిధంగా అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం రూ.10000లను ఇస్తారు. అదేవిధంగా రూ.1000కి మించకుండా..ఇతర ఖర్చులు చేసేందుకు అధికారులకు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని తర్వాత కాలంలో గౌరవించడంతోపాటు శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 8, 2024 7:05 pm
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…
బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…