Political News

జ‌గ‌న్ కేసులు ఇప్ప‌ట్లో తేల‌వంటే.. తేల‌వు.. అంతే..?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ పై న‌మోదైన అక్ర‌మ ఆస్తుల వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన కేసులు ఇప్ప‌ట్లో తేలే లా క‌నిపించ‌డం లేదు. తాజాగా సుప్రీంకోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాది దాఖ‌లు చేసిన అఫిడవిట్‌లోను.. త‌ర్వాత వినిపించిన వాద‌న‌ల్లోనూ ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. జ‌గ‌న్ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలా మంది ఇప్ప‌టికే డిశ్చార్జ్‌(త‌మ‌కు, ఈ కేసుల‌కు సంబంధం లేద‌ని.. త‌మ‌ను ఈ కేసుల నుంచి తొల‌గించాల‌ని కోరుతూ వేసే పిటిష‌న్లు) పిటిష‌న్లు వేశారు.

ఇలా.. మొత్తం 93 మంది నిందితులుగా ఉన్న వారు డిశ్చార్జ్ పిటిష‌న్ లు దాఖ‌లు చేశారు. వీటి వ‌ల్లే కేసులు ఆల‌స్య మ‌వుతున్నాయ‌ని సీబీఐ త‌ర‌ఫున న్యాయ‌వాదులు పేర్కొన్నారు. సాధార‌ణంగా ఇలాంటి కేసుల్లో డిశ్చార్జ్ పిటిష‌న్లు కామ‌నే. అయితే.. ఈ కేసుల్లో మ‌రిన్ని ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. ఇప్పుడు వీటిని ముందు తేల్చాల్సి ఉంటుంది. ఈ విష‌యాన్నే సీబీఐ తెలిపింది. డిశ్చార్జ్ పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయ‌ని, ఇంకా వేస్తూనే ఉన్నార‌ని పేర్కొంది.

ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ ముందుకు సాగి.. నిందితుల ప్ర‌మేయం లేద‌ని తేల్చేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని సీబీఐ త‌న అఫిడ‌విట్‌లో పేర్కొంది. దీనినే సుప్రీంకోర్టు.. ‘మాకు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. ఇక్క‌డ సుప్రీంకోర్టు ఉద్దేశం .. డిశ్చార్జ్ పిటిష‌న్ల‌పై కాదు.. అస‌లు విచార‌ణ మంద‌గిస్తున్న విధానం పైనే. అయిన‌ప్ప‌టికీ.. విచార‌ణ‌ను ముందుకు తీసుకువెళ్లాల‌ని మాత్రం కోర్టు తేల్చి చెప్పింది. కానీ, దీనిని డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను దూరంగా పెట్టి విచారించే ప‌రిస్థితి లేదు.

ఈ వాద‌న‌లే సీబీఐ కూడా వినిపించింది. ఆ 93 డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను విచారించేందుకు మ‌రో ఐదారేళ్లు ఈజీగా ప‌డుతుంది. క‌నీసం ఏడాదికి 30 డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను తేల్చినా.. మూడేళ్లు ప‌డుతుంది. వారిని విభేదిస్తూ.. సీబీఐ మ‌ళ్లీ రివ్యూ పిటిష‌న్లు వేస్తే.. మ‌రికొన్నేళ్లు ప‌డుతుంది. ఇదే రాబోయే రోజుల్లో జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ప్ప‌టికీ.. సుప్రీంకోర్టు ప్ర‌ధాన పిటిష‌న్‌పై విచార‌ణ చేయాల‌ని ఆదేశించింది. దీనికి స‌మాధానం చెప్పేందుకు గ‌డువు కోరారు. దీంతో మొత్తంగా చూస్తే..జ‌గ‌న్ కేసులు ఇప్ప‌ట్లో తేలేలా లేవ‌ని స్ప‌ష్ట‌మైంది.

This post was last modified on August 8, 2024 6:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క తమిళ ఇంటర్వ్యూతో సరిచేసిన పవన్

ఇటీవలే సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డు గురించి కార్తీ సెన్సిటివ్ టాపిక్ అంటూ నవ్వుతు…

3 mins ago

వనిత విజయ్ కుమార్… నాలుగో పెళ్లి

వనిత విజయ్ కుమార్.. ఈ నటి చేసిన సినిమాల కంటే.. ఆమె చుట్టూ నడిచిన వివాదాలే ఎక్కువ. దివంగత నటి…

3 mins ago

నా దీక్ష తిరుమ‌ల ల‌డ్డూ కోస‌మే కాదు:  ప‌వ‌న్‌

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌న్న ఆరోప‌ణ‌లు తెర‌మీదికి వ‌చ్చిన నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

3 hours ago

మోడీ వ‌ర‌ద సాయం ఏపీ కన్నా మ‌హారాష్ట్ర‌కు ఎక్కువ ఎందుకు?

ఏపీలోని విజ‌య‌వాడ‌, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో గ‌త నెల 1 నుంచి 15 వ తేదీల మ‌ధ్య తీవ్ర వ‌ర‌ద…

3 hours ago

దేశంలో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్

హైదరాబాద్ మహానగరాన్ని మరింత సౌకర్యవంతంగా తయారు చేసేందుకు వీలుగా రేవంత్ రెడ్డి సర్కారు భారీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ లో…

14 hours ago

కలెక్షన్లు డ్రాప్.. కంగారేం లేదు దేవరా!

గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ మిక్స్డ్ టాక్‌తో మొదలైనప్పటికీ తొలి రోజు,…

19 hours ago