Political News

స‌తీమ‌ణికి చీర‌లు కొన్న చంద్ర‌బాబు.. కాస్ట్ ఎంతంటే!

సీఎం చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి చీర‌లు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గ‌తంలో భువ‌నేశ్వ‌రి ఓ సంద‌ర్భంలో ..చంద్ర‌బాబు ఎప్పుడూ ప్ర‌జ‌లు, ప్ర‌జ‌లు అంటారే త‌ప్ప‌.. ఇంట్లో వాళ్ల‌ను ప‌ట్టించుకోర‌ని.. ఎప్పుడో పెళ్ల‌యిన కొత్త‌లో ఒక్క చీర కొన్నార‌ని, దానిని తాను భ‌ద్రంగా దాచుకున్నాన‌ని ఆమె చెప్పారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో తాజాగా సీఎం చంద్ర‌బాబు చీరలు కొన‌డం ఆస‌క్తిగా మారింది. బుధ‌వారం జాతీయ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని చంద్ర‌బాబు త‌న స‌తీమ‌ణికి ఈ చీరలు కొనుగోలు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

విజయవాడలో నిర్వ‌హించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చీర‌ల స్టాల్స్ ను సంద‌ర్శించారు. నేత‌న్న‌ల నైపుణ్యాన్ని ప‌రిశీలించి అచ్చ‌రువొందారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. వీటిలో ఒక‌టి వెంకటగిరి, రెండోది ఉప్పాడ జాందాని చీరలు కావ‌డం విశేషం. వీటిలో ఒక‌టి 7 వేల రూపాయ‌లు, రెండోది 12 వేల రూపాయ‌లుగా వ్యాపారులు చెప్పారు. ఎలాంటి బేరం చేయ‌కుండానే చంద్ర‌బాబు సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఈ స‌మ‌యంలో నేత‌న్న‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వివ‌రించారు.

నేత‌ల‌పై జీఎస్టీని త‌గ్గించాల‌ని వారు కోరారు. ముడి స‌రుకుల ధ‌ర‌ల‌ను కూడా త‌గ్గించాల‌ని..అ దేవిధంగా అందుబాటులోకి తీసుకురావాల‌ని కూడా కోరారు. దీనికి చంద్ర‌బాబు ఓకేచెప్పారు. అదేవిధంగా ప్ర‌తి ఒక్క‌రూ వారానికి ఒక్క‌సారైన చేనేత వ‌స్త్రాలు ధ‌రించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌జ‌లకు పిలుపునిచ్చారు. త‌ద్వారానేత‌న్న‌ల‌ను ప్రోత్స‌హించాల‌న్నారు. అనంత‌రం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్న ఆయ‌న‌.. వారి క‌ష్టాలు త‌న‌కు తెలుసున‌ని వ్యాఖ్యానించారు. అన్నింటినీ ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు.

This post was last modified on August 7, 2024 11:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మిడిల్ క్లాస్ దర్శకుడి వెరైటీ ప్రయోగం

క్రియేటివిటీకి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. కొత్త తరం దర్శకుల ఆలోచనలు చూస్తే అదే అనిపిస్తుంది. గత…

18 minutes ago

పాకిస్తాన్ కు రోహిత్?.. వెళ్లక తప్పదా?

అప్పుడెప్పుడో...2008లో దాయాది దేశం పాకిస్తాన్ లో భారత క్రికెట్ జట్టు పర్యటించింది. అదే ఏడాది పాక్ ఉగ్రవాదులు ముంబై ఫై…

32 minutes ago

పుష్ప 2 రీ లోడ్ కోసం కొత్త స్ట్రాటజీలు

ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ రీ లోడెడ్ వెర్షన్ ఇరవై నిమిషాల అదనపు ఫుటేజ్ తో…

40 minutes ago

అనిల్ రావిపూడి పట్టుదల… సంక్రాంతికి కాసుల కళ

ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడమనే సంప్రదాయం 2023లో మైత్రి సంస్థ విజయవంతంగా…

2 hours ago

ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే... వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు…

2 hours ago

గంభీర్ మెడపై వేలాడుతున్న ‘ఛాంపియన్స్’ కత్తి

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎందుకనో గానీ ఇటీవలి కాలంలో ఏ ఒక్కటీ కలిసి రావడం లేదు.…

3 hours ago