ఏపీ రాజధాని అమరావతికి శ్రావణం సెంటిమెంటు కలిసి రానుంది. కీలకమైన పనులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారులను ఒప్పించేందుకు.. ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు రాజధానిలో పనులు ప్రారంభించారు. గత ఐదేళ్ల కాలంలో రాజధాని పనులు చేపట్టకపోవడంతో ప్రధానమైన నవనగరాలు ప్రాంతం చిట్టి అడివిని తలపిస్తోంది. అదేవి ధంగా చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిలబడి పోతోంది. దీంతో అసలు అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద రాజధాని ప్రాంతంలో దట్టంగా పేరుకుపోయిన చెట్లు, తుమ్మ మొక్కలు.. వ్య ర్థాలను తొలగించనున్నారు. మొత్తంగా 24 వేల ఎకరాలలో పేరుకుపోయిన ముళ్ల చెట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికిగాను నిరంతరాయంగా 24 గంటలసేపు కార్మికులు పనిచేసినా.. నెల రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ మొత్తం క్లియరెన్స్ కోసం 32 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులనే కొత్త పాలసీని తీసుకుంది. దీంతో రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా రాజధాని ప్రాంతం ఓ చిట్టడివిగా మారింది. దీనిని మరోసారి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు, రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు నెల రోజులకుపైగానే సమయం పట్టనుంది. మొత్తానికి శ్రావణ మాసం ప్రారంభం కాగానే.. పనులు ప్రారంభిం చారు.
దీంతో ఇటు పనులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు.. అమరావతిలో నిర్మించిన వివిధ భవనాల పటిష్ట తపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని.. ఉన్న భవనా లను కేటాయించడం.. లేదా కొత్త భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం అనే అంశాలపై ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా శ్రావణ మాసం సెంటిమెంటుతో అమరావతి పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఇక, మీదట వారాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కూడా నిర్ణయించారు.
This post was last modified on August 7, 2024 11:29 pm
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…