Political News

ష‌ర్మిల ఎందుకు ఒంట‌ర‌య్యారు? ఏం జ‌రుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఒంటరి అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన నాయకులతో కూడిన పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఏపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికి పార్టీకి అండగానే ఉన్నారు. వీరిలో పల్లంరాజు, రఘువీరారెడ్డి, శైలజనాథ్ అదే విధంగా కేంద్ర మంత్రులుగా పని చేసిన‌ వారు కూడా ఇప్పుడు ఈ కోవలోనే ఉన్నారు. అయితే వీరందరినీ కలుపుకొని వెళ్లాల్సిన షర్మిల.. తన ఏకపక్ష వైఖరితో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

అంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంతమంది నాయకులు కూడా ఈ పది ఏళ్ల‌ కాలంలో పార్టీని ఏమీ చేయలేకపోయారు.. కనీసం పుంజుకునేలా చేయలేకపోయారు కాబట్టి వీరంతా వేస్ట్ అనుకునే పద్ధతిలో ఆమె వ్యవహరిస్తున్నారని సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చ. నిజానికి రఘువీరారెడ్డి ఏమి చేయలేదా? అంటే ఆయన బానే కష్టపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. పాదయాత్ర కూడా చేశారు. బలమైన నాయకుల్ని ఆయన ఎంపిక‌ చేసి పోటీలో పెట్టారు.

కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీని దెబ్బతీసింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న సాకే శైలజనాథ్ కూడా బలంగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఎస్సి నాయకుడిగా ఆయన ఎస్సీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడంలోను, పార్టీ వైపు తిప్పడంలోనూ ఎంతో ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలైన వ్యతిరేకతను ఎదుర్కోవడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. దానిని పరిష్కరించి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే దిశగా ఒక అడుగు వేస్తారు అన్న ఉద్దేశంతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది.

కానీ. షర్మిల మాత్రం ఇప్పుడున్న వారందరూ పనికిరాని నాయకులుగా.. తను మాత్రమే భారీ ఎత్తున పార్టీని లైన్లో పెట్టే నాయకురాలిగా భావిస్తూ సీనియర్లను పక్కన పెడుతున్నార‌నేది పార్టీలో సాగుతున్న చ‌ర్చ‌. నిజానికి పార్టీకి ఓటు బ్యాంకు లేకపోవచ్చు కానీ బలమైన కేడర్ ఇప్పటికి ఉంది. ఎన్నికలకు ముందు అనంతపురంలో జరిగిన సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరు అయ్యారు. అలాంటి పార్టీకి కావాల్సింది అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన నాయ‌కుడు. ప్రజల సమస్యల ఏమిటో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య తెగిపోయిన విషయం ఏంటో తెలుసుకుని దాన్ని సరి చేసేదిగా అడుగులు పడాలి.

కానీ షర్మిల ఆ రకంగా కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించే దిశ‌గా ముందుకు వెళుతుండడంతో సీనియర్లు ఆమెను దాదాపు వదిలేశారని అంటున్నారు. ఎన్నికలకు మధ్యలోనే షర్మిలను పక్కన పెట్టిన ట్టు చెబుతున్నారు. ఇక తరచుగా పార్టీలో జోక్యం చేసుకునే కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు వంటి వారు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమెకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ష‌ర్మిల వైపే మొగ్గు చూపడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఒక చర్చ ఉంది. దీంతో పార్టీ పరంగా వీరంతా షర్మిలను దూరం పెట్టి.. పని చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

This post was last modified on August 7, 2024 11:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

లక్కీ భాస్కర్.. సాధించాడహో

ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…

56 mins ago

రుషికొండ ప్యాలెస్ జగన్ రాజకీయ సమాధి: రఘురామ

500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…

2 hours ago

వైసీపీ ప్రతిపక్ష హోదాపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…

2 hours ago

లోకేష్ స్పీచ్‌కు లైకులు ప‌డుతున్నాయ్‌.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్ర‌సంగాల‌కు మంచి లైకులు ప‌డు తున్నాయి. ఇది ఏదో…

2 hours ago

పుష్ప-2లో షాడో విలన్

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…

3 hours ago

విశ్వక్‌కు అప్పుడు నో చెప్పిన హీరోయినే..

ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…

5 hours ago