ఏపీలో కొత్త లిక్కర్ పాలసీకి చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిని అక్టోబరు 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యా ప్తంగా అమలు చేయనున్నారు. నూతన మద్యం విధానం మేరకు ప్రస్తుతం ఉన్న అన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేయ నున్నారు. ఇదేసమయంలో ప్రైవేటుకు అప్పగిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం బార్లు మాత్రమే ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటికి సంబంధించిన లైసెన్సులు ఈ ఏడాది నవంబంరు-డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. వీటిని అలానే కొనసాగించనున్నారు. అనంతరం.. వాటిని కూడా విస్తరించనున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో 50 వేల ఇళ్లకు ఒక బార్ ను కేటాయించారు. దీని వల్ల అక్రమ మద్యం అమ్మకాలు పెరిగాయన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 20-30 వేల ఇళ్లకు ఒక బార్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అదేస మయంలో చీపు లిక్కర్‌ను పూర్తిగా తీసేయనున్నారు. నూతన మద్యం పాలసీలో కీలకమైన విధానం ఇదే. దీని స్థానంలో మంచి బ్రాండ్లను తీసుకువస్తారు. గతంలో జగన్ హయాంలో ఉన్న బూమ్ బూమ్, ప్రెసిడెంట్, త్రీ కేపిటల్ వంటి చీపురకం బ్రాండ్లను పూర్తిగా తీసేయనున్నారు. వీటి స్థానంలో రాయల్ స్టాగ్ సహా ఇతర ప్రీమియం బ్రాండ్లకు బాటలు పరచనున్నారు.
ఇక, కీలకమైన ధరల విషయానికి వస్తే.. గత ప్రభుత్వం రూ.60 విలువ చేసే బ్రాండ్ మద్యాన్ని కూడా రూ.200పై చిలుకు చొప్పున విక్రయించింది. దీనివల్ల మద్యం తాగే వారు దూరంగా ఉండి మద్యపాన వినియోగం తగ్గుతుందని అంచనా వేసింది. కానీ, ఇది వికటించింది. దీంతో మద్యం ధరలను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు సైతం దీనికి ఆమోదం తెలుపుతూ.. తాము అధికారంలోకి వస్తే.. ఖచ్చితంగా ధరలు తగ్గిస్తామన్నారు. ఇప్పుడు అదే నిర్ణయం తీసుకున్నారు. గత చంద్రబాబుపాలనలో ఉన్న ధరలనే అందుబాటులోకి తీసుకువచ్చేలా డిస్టిలరీను ఒప్పించేందుకు కమిటీ వేయాలని నిర్ణయించారు.
నూతన మద్యం పాలసీలో మరో కీలక అంశం.. పర్మిట్ రూమ్‌ల ఏర్పాటు. గతంలో ఉన్నాయి. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక పర్మిట్ రూమ్‌లను ఎత్తేశారు. దీంతో ఎక్కడ బడితే అక్కడ మద్యం తాగడం.. మహిళలను వేధింపులకు గురిచేయడం.. వంటి కేసులు వెలుగు చూశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లను పరిమితంగా అనుమతిం చాలని నిర్ణయించింది. గ్రామీణ స్థాయిలో కన్నా.. పట్టణాలు, నగరాల్లో పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఉంటుంది. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి.. అక్కడే తాగేందుకు అనుమతి ఇవ్వనున్నారు. తద్వారా.. అసాంఘిక నేరాలు తగ్గుముఖం పడతాయన్నది సర్కారు అంచనా. మొత్తంగా అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని తీసుకురానున్నారు.
This post was last modified on August 7, 2024 9:08 pm
మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…
సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…
ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…