భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ కు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె బంగారు పతకం తేవడం ఖాయమని యావత్ భారతావని ఎదురుచూస్తోంది. అయితే, అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఐఓసీ వేటు వేసింది.
దీంతో, ఆమె ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వినేవ్ ఫొగాట్ వేటుపై భారత్ అప్పీల్‌కు వెళ్ళింది. ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వినేశ్ ఫొగాట్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెపై అనర్హత వేటు వేసింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. యావత్ భారత దేశం ఫొగాట్ వెంట ఉందని మోదీ అన్నారు. అంతేకాదు, ఆ అనర్హతపై భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) చీఫ్ పీటీ ఉషతో ఫోన్ లో మోదీ మాట్లాడారు. అసలేం జరిగింది? అన్న వివరాలను పీటీ ఉషను అడిగి తెలుసుకున్నారు. వినేశ్ ఫోగాట్ అనర్హతకు దారితీసిన కారణాలను మోదీకి పీటీ ఉష వివరించారు. వినేశ్ కు సాయపడగలిగిన మార్గాల గురించి ఉషను ఆయన అడిగారు. ఒలింపిక్స్ లో గట్టిగా నిరసన తెలపడం ద్వారా ఉపయోగం ఉంటుంది అంటే అలా చేయాలని మోదీ సూచించారు.
అయితే, ఒలింపిక్స్‌లో రూల్స్ ఉంటాయని, రెజ్లర్ 50 లేదా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని విశేశ్ ఫొగల్ పెదనాన్న మహవీర్ ఫొగట్ అంటున్నారు. ఆమె ఎప్పటికైనా బంగారు పతకం సాధిస్తుందని, తదుపరి ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తానని అన్నారు. ఇక, ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘నో… నో… నో… ఇది నిజం కాకపోతే బాగుండు’ అని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates