కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రతను బట్టి బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ త్వరలోనే బార్లను బార్లా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తెలంగాణలో మూతపడ్డ బార్లు, పబ్బులు, క్లబ్బులు తెరుచుకునేందుకు అనుమతులిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటిస్తూ వాటిని తెరుచుకోవచ్చిన ప్రకటించింది. అక్కడ పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. రోజుకు 2సార్లు ఆ ప్రాంతాలను శానిటైజ్ చేయాలని, ప్రభుత్వ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా బార్లు, పబ్బులు, క్లబ్బుల యజమానులకు పలు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఆయా ప్రదేశాల దగ్గర క్యూ పద్దతి పాటించేలా, శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, బార్లు, పబ్బులలో పనిచేసే సిబ్బంది అందరూ మాస్కులు , హ్యాండ్ గ్లౌసెస్ ధరించాలని స్పష్టం చేసింది. రోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బార్లు క్లీన్ చేయాలని పేర్కొంది. కస్టమర్ కూర్చునే ముందు కుర్చీలు , టేబుల్ శుభ్రపరచాలని తెలిపింది. ఆయా ప్రదేశాల్లో వెంటిలేషన్ తగినంత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లపై నిషేధం కొనసాగనుందని తెలిపింది. మ్యూజికల్ ఈవెంట్స్ ,డాన్స్ ఫ్లోర్స్ , గుమిగూడడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
This post was last modified on September 25, 2020 8:25 pm
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…