రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. విషయాలు ఏమిటి అనేది పక్కన పెడితే దీని వెనక చంద్రబాబు చాలా వ్యూహ.. ప్రతి వ్యూహాలతో ముందుకు సాగారు అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న కలెక్టర్లను ఎస్పీలను తొలగించి కొత్తవారిని నియమించిన తర్వాత చంద్రబాబు ఈ సమావేశం పెట్టడం గమనార్హం.
ఇదే సమయంలో తన పాలను ఎలా ఉండాలి? తాను ఏ విధంగా అడుగులు వేయాలని అనుకుంటు న్నారు? అనే విషయాలను ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే కలెక్టర్లకు ముఖ్య మంత్రి ఒక విధమైన మార్గం ఏర్పాటు చేసినట్లయింది. ఏదైనా ఉంటే తనతోనే చెప్పాలని తనను సంప్రదించిన తర్వాతే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 1995 నాటి తన పాలనను చంద్రబాబు ప్రస్తావించారు. అప్పట్లో కూడా ముఖ్యమంత్రి కేంద్రంగా పాలన సాగింది.
కలెక్టర్లు ఎవరూ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకూడదని ముఖ్యమంత్రి చెప్పింది పాటించాలని అప్పట్లో చంద్రబాబు బహిరంగంగానే చెప్పారు. అయితే అప్పటికి ఇప్పటికి కొంత మార్పు ఉంది. అదేంటంటే అప్పట్లో కేవలం టిడిపి మాత్రమే అధికారంలో ఉండగా ఇప్పుడు కూటమి పార్టీల ప్రభుత్వం ఉంది. కాబట్టి మూడు పార్టీల మధ్య అనుసంధానం, మూడు పార్టీల నాయకుల మధ్య ఉన్న వైరుధ్యాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే కలెక్టర్లు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది సమస్యగా మారింది.
ఇదే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పడానికి కారణం. మూడు పార్టీల నాయకులు అధికారంలో ఉన్నప్పటికీ తాను చెప్పింది మాత్రమే వినాలి అని చంద్రబాబు పరోక్షంగా కలెక్టర్లను హెచ్చరించారు. సూచించారు కూడా. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తాను చంద్రబాబు చెప్పినట్టే వింటానని చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు మాత్రమే ఫైనల్ అన్నట్టుగా కలెక్టర్ లకు దిశానిర్దేశం చేశారు.
ఈ పరిణామాలను చూస్తే చంద్రబాబు వ్యూహం ప్రకారమే ప్రభుత్వ నడుస్తుందన్న విషయం స్పష్టమైంది. ఫలితంగా జిల్లాల్లోనూ.. రాష్ట్ర స్థాయిలను గ్రూపులు, గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేలాగా చంద్రబాబు వ్యవహరించారు. ఇది మంచి పరిణామం. కలెక్టర్లు సాఫీగా పనిచేసేందుకు అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయినా మునుముందు సమస్యలు వస్తాయనేది స్పష్టం. మరి వీటిని ఏ విధంగా అధిగమిస్తారు? ఎలా ముందుకు సాగుతారు అనేది చూడాలి.
This post was last modified on August 6, 2024 3:41 pm
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…