“రండి పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ ఇప్పుడు పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికాలోని ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రం ఇప్పుడు అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడులు పెట్టేవారిని ఆహ్వానిస్తున్నామన్నారు. తాజాగా అమెరికాకు వెళ్లిన రేవంత్‌రెడ్డి న్యూజెర్సీలో తెలంగాణకు చెందిన తెలుగు వారిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడులపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం గమనార్హం.
“తెలంగాణ మీ జన్మభూమి, ఇక్కడ పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం.. ప్రతిఫలం ఉంటుంది” అని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుంటే ఆనందం బోనస్‌గా వస్తుందని చెప్పారు. తెలంగాణలో పదేళ్లు సాగిన కేసీఆర్ దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని గతంలో చెప్పిన విషయాన్ని తాజాగా ఆయన ప్రస్తావించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు తాను ఇచ్చిన హామీలను వివరించారు. అయితే.. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని.. అదేవిధంగా రైతులకు రుణ మాఫీ చేస్తున్నామని చెప్పారు. ఇక, ఉద్యో గాలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చామన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని అమలు చేస్తున్నట్టు చెప్పారు.
అలానే ఇప్పుడు కూడా ఎన్నారైలకు తాను హామీ ఇస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి అన్ని సౌకర్యాలు అందిస్తామన్నారు. రూపాయి కి రూపాయి వచ్చేలా చూస్తామని.. తెలంగాణ నేల తన వారి కోసం ఎదురు చూస్తోందని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ, రేవంత్‌కు భారీ ఎత్తున స్వాగతం లభించడం విశేషం.
This post was last modified on August 5, 2024 3:01 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…