Political News

పీ-4 పాల‌సీనే స‌ర్కారు అజెండా: చంద్ర‌బాబు

పీ-4(పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్) పాల‌సీనే స‌ర్కారు అజెండా అని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బా బు చెప్పారు. తాజాగా ప్రారంభ‌మైన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న మాట్లాడారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారన్న ఆయ‌న‌ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నిర్దేశించే విధంగా కలెక్టర్ లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్ళాలన్నారు. జవాబుదారీతనంతో క‌లెక్ట‌ర్లు పని చేయాలని సూచించారు. ప్రజలకు సుపాలన, అభివృద్ధి అందించడంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

పి4 పాలసీ ప్రభుత్వ అజెండా అని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంపద సృష్టికి, సంక్షేమం అమలుకు వినూత్నంగా ఆలోచించి మావతా ధృక్పథంతో పని చేయాల‌ని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాల‌న్నారు. ప్రతి నెలా 1వ తేదీన ‘పేదల సేవ’లో అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రజా క్షేత్రంలో ఉంటూ ప్రజల కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసి పరిష్కార మార్గం ఆలోచించాలని సూచించారు.

కలెక్టర్ లు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సీఎం చంద్ర‌బాబు సూచించారు. ప్ర‌జ‌ల‌ సమస్యల‌ను తమ సమస్యగా భావించి పరిష్కారం చూపాలన్నారు. సులభతర, సమర్థవంతమైన పాలనను అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 2047 వికసిత్ భారత్ పేరుతో ముందుకు వెళుతుందని, రాష్ట్రానికి సంబంధించి అక్టోబర్ 2న దీనికి సంబంధించి డాక్యుమెంటరీ తయారు అవుతుందని తెలిపారు.

రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలని చంద్ర‌బాబు సూచించారు. దీని వ‌ల్ల ఉద్యోగ‌, ఉపాధి రంగాల్లో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి క‌నిపించేలా కృషి చేయాల‌న్నారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ.. సూపర్ సిక్స్ అమలుకు చర్య లు తీసుకుంటామ‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ వీటికి అనుగుణంగా ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. అవినీతి, అక్ర‌మాలు లేని స‌మాజం దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించేందుకు కృషి చేయాల‌ని సూచించారు.

This post was last modified on August 5, 2024 1:20 pm

Share

Recent Posts

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

12 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

40 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

49 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

3 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

5 hours ago