పూరి జగన్నాథ్‌కు చాలా కాలం తర్వాత గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా.. ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమాకు ఆ టైంలో అన్నీ బాగా కలిసి వచ్చాయి. అదంత పెద్ద హిట్ కావడంలో హీరోయిన్ల గ్లామర్ కూడా కీలకం అనడంలో సందేహం లేదు. నభా నటేష్, నిధి అగర్వాల్‌లను సూపర్ సెక్సీగా చూపించి కుర్రాళ్లను ఉర్రూతలూగించాడు పూరి. ముఖ్యంగా నభా ఆ చిత్రంలో చేసిన గ్లామర్ విందు మరే సినిమాలోనూ చేయలేదు. ఆమె ఇమేజ్‌ను ఆ చిత్రంతో మార్చేశాడు పూరి.
ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ తీస్తూ.. హీరోను మాత్రమే కొనసాగించి, హీరోయిన్లను పక్కన పెట్టేశాడు పూరి. సీక్వెల్స్‌లో ఎప్పుడూ ఇదే వరస. హీరో మారడు, హీరోయిన్లు మారిపోతుంటారు. ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ అదే జరిగింది. ఐతే నభా, నిధి ఫ్యాన్స్ సీక్వెల్లో వాళ్లను మిస్సవుతున్న మాట వాస్తవం. కానీ నిధి, నభాలిద్దరూ లేని లోటును ఒక్క కావ్య థాపరే తీర్చేస్తుందా అనిపిస్తోంది.
కావ్య థాపర్ గ్లామర్ ఎటాక్ ‘ఏక్ మిని కథ’ లాంటి కొన్ని చిత్రాల్లో ఇంతకుముందే కొన్ని చిత్రాల్లో చూశాం. ఐతే ‘డబుల్ ఇస్మార్ట్’లో ఇంకో లెవెల్ చూడబోతున్నామని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన డ్యూయెట్లో కావ్య అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. ఇప్పుడు ట్రైలర్లో ఆమె ఇంకా సెక్సీగా కనిపించింది. ఒక షాట్లో క్లీవేజ్ షో చూసి కుర్రాళ్లు షాకైపోయారు. ఆ షాట్ వరకు కట్ చేసి వైరల్ చేస్తున్నారు. ట్రైలర్లో చివర్లో ఒక ఘాటు ముద్దును కూడా చూపించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కావ్య చేసిన షోకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఇంతకుమించిన గ్లామర్ ఎటాక్ ఉంటుందని కుర్రాళ్లు ఆశలతో ఉన్నారు. మొత్తానికి ‘ఇస్మార్ట్ శంకర్’లో నభా, నిధి కలిసి ఇచ్చిన గ్లామర్ విందును ఒక్క కావ్యనే ఇవ్వబోతోందన్నమాట.
This post was last modified on August 5, 2024 2:45 pm
మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్.. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…
ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…
ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…