Movie News

అల్లు శిరీష్ కథ మళ్లీ మొదటికి

టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవలే మళ్లీ బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. కానీ ఈసారి కూడా పాస్ మార్కులు పడలేదు. తన కొత్త చిత్రం ‘బడ్డీ’ దారుణంగా బోల్తా కొట్టింది. అసలే హైప్ లేని సినిమా. పైగా పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఉత్సాహభరితమైన వాతావరణం లేని సమయంలో రిలీజైంది. ఇంకేముంది మినిమం ఇంపాక్ట్ వేయకుండానే ఈ సినిమా కథ ముగిసింది. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాలన్న ఉద్దేశంతో రేట్లు తగ్గించి మరీ రిలీజ్ చేశారు.

ఐతే కంటెంట్ ఉన్న సినిమా అయితే రేట్లు తగ్గిస్తే ప్రయోజనం. కానీ అది లేనపుడు ఏం చేసినా లాభం ఉండదు. తొలి రోజు ‘బడ్డీ’ థియేటర్లలో కాస్త జనం కనిపించారు. కానీ రెండో రోజుకు సినిమా వెలవెలబోయింది.

శని, ఆదివారాల్లో కూడా ‘బడ్డీ’కి చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ఆదివారం తర్వాత పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్లే అయింది. సినిమా ఫలితమేంటో తొలి రోజే తేలిపోవడంతో తర్వాత పబ్లిసిటీ గురించి టీంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా సినిమాను పుష్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘తంగలాన్’ ప్రమోషన్ల కోసం ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన జ్ఞానవేల్ రెండు రోజుల కిందటే రిలీజైన తన చిత్రం ‘బడ్డీ’ ఊసే ఎత్తకపోవడాన్ని బట్టి ఈ సినిమా మీద ఆయన ముందే ఆశలు వదిలేసుకున్నారని అర్థమవుతోంది.

శిరీష్ సినిమాకు సినిమాకు గ్యాప్ తీసుకుని ఏదో కష్టపడుతున్నాడు కానీ.. సరైన సబ్జెక్ట్ ఎంచుకోకపోవడంతో అతడి రాత మారట్లేదు. ‘బడ్డీ’తో మరో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న శిరీష్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈసారైన అల్లు అరవింద్, అల్లు అర్జున్, బన్నీ వాసు కొంచెం దృష్టిపెట్టి తన కోసం ఒక మంచి ప్రాజెక్టు సెట్ చేసి కెరీర్ పుంజుకునేలా చేస్తారేమో చూడాలి.

This post was last modified on August 5, 2024 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఔను… డేటింగ్ చేస్తున్నా-ఆమిర్

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ ఆమిర్ ఖాన్‌కు ఇప్ప‌టికే రెండుసార్లు పెళ్ల‌యింది. ముందుగా త‌న చిన్న‌నాటి స్నేహితురాలు రీనా ద‌త్తాను ప్రేమించి…

1 minute ago

సమీక్ష – కోర్ట్

హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…

2 minutes ago

లులూ తిరిగొచ్చింది!… కొత్తగా దాల్మియా వచ్చింది!

కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…

7 minutes ago

గ్రీష్మ‌ రాక తో వైసీపీ మ‌రింత డీలా

వైసీపీ మ‌రింత డీలా ప‌డ‌నుందా? ఆ పార్టీ వాయిస్ మ‌రింత త‌గ్గ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం…

2 hours ago

సీతమ్మ వాకిట్లో.. నాగ్ వాకిట నుంచే

ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…

8 hours ago

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

11 hours ago