వైసీపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎలాంటి ఆదేశం ఇవ్వాలన్నా.. పార్టీ అధినేత జగన్‌దే ఫైనల్ నిర్ణయం. సాధారణంగా అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు ఉంటాయి. వ్యక్తిగత ప్రాంతీయ పార్టీలు కావడంతో ఆయా పార్టీల్లో అధినేతలే సుప్రీం. అదే జాతీయ స్థాయి సంస్థాగత పార్టీలైతే మాత్రం.. ఒక నిర్ణయం తీసుకునేందుకు పొలిట్ బ్యూరోనో.. లేక.. పార్టీ అధిష్టానమో చర్చించి నిర్ణయాలు తీసుకుంటా యి. అయినప్పటికీ.. టీడీపీ వంటి పార్టీల్లో మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయి నాయకుల నిర్ణయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అడుగులు వేస్తారు.
అయితే.. ఎటొచ్చీ.. వైసీపీలోనే ఎప్పుడూ కేంద్రీకృత నిర్ణయాలు, కేంద్రీకృత పాలన వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు ఉన్నారని, వారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఎన్నడూ వైసీపీ అధినేత జగన్ పట్టించుకోలేదు. పరిగణనలోకి తీసుకోనూ లేదు. దీంతో పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. జగనే ఫైనల్. అయితే.. ఇది ఎన్నికలకు ముందు వరకు. కానీ, ఇప్పుడు పంథా మారింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. క్షేత్రస్థాయి పార్టీ నేతలతో చర్చించాకే! అని వైసీపీలో ఇప్పుడు వినిపిస్తున్న వాదన.
దీనికి కారణం.. ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాయి. ఆ సమయంలో ఇలా వద్దు.. అలా వద్దు.. అన్న నాయకులను జగన్ తిట్టిపోశారని కూడా వార్తలు బయటకు వచ్చాయి. దీంతో నాయకులు ఏం జరిగితే అదే జరుగుతుందని మౌనంగా ఉండిపోయారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. దాదాపు 80 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను మార్చేయడం.. ముక్కు మొహం తెలియని వారిని కూడా తీసుకువచ్చి.. పోటీలో పెట్టడంతో అప్పటి వరకు ప్రజలకు పరిచయం ఉన్న నాయకులు పరేషాన్ అయ్యారు.
ఫలితంగా గెలవాల్సిన తిరువూరు నియోజకవర్గం, పామర్రు నియోజకవర్గం వంటి చోట్ల కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ పరిణామాలతో దిగివచ్చిన జగన్.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ నాయకులతో చర్చించే తీసుకుంటున్నా రని అంటున్నారు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోటీలో బొత్స సత్యనారాయణ పేరును ఇలానే చర్చించి తీసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 100కుపైగా నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్చాలని నిర్ణయించుకున్నారని.. దీనిని కూడా పార్టీ నేతలతో చర్చించే తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మార్పు.. ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.
This post was last modified on August 5, 2024 10:23 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…