వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికి మూడుసార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం.. తిరిగి తాడేపల్లికి చేరుకోవడం తెలిసిందే. అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగుళూరు పర్యటన పెట్టుకోవడం గమనార్హం.
అతి కూడా సతీ సమేతంగా అక్కడ ఉండటం తన బంధువులతో కలిసి చర్చలు జరపడం వంటివి చేస్తున్నారు. అయితే దీని వెనుక అసలు రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చర్చిగా మారింది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య రెండున్నర సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు ఎక్కువ కాలం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోనే ఉన్నారు. 2014 నుంచి 2017 వరకు కూడా ఆయన హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టినా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం తిరిగి వెళ్ళిపోవడం చేశారు.
హైదరాబాద్ లోటస్పాండ్ లోనే నివాసం ఉండడం వంటివి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు హైదరాబాద్ మొహం కూడా ఆయన చూడట్లేదు. లోటస్పాండ్ లో అసలు అడిగే పెట్టట్లేదు. దీనికి కారణం షర్మిలేనని అంటున్నారు. ఎందుకంటే లోటస్ పాండ్ లోని ఒకవైపు షర్మిల ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తనకు ఇచ్చేయాలని షర్మిల కొన్నాళ్లుగా రాయబారం చేయిస్తున్నారని, దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదని పార్టీ వర్గాల్లోని కీలకమైన నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
లోటస్ పాండ్ నిర్మాణం వైయస్ హయాంలో జరిగింది. దీనిని పంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో షర్మిల బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడే మకాం వేసి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు. అయినా లోటస్పాండ్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. లోటస్ పాండ్‌లోని ఒక భాగంలో ఆమె కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. దీంతో ఆ ఇంట్లోనే విజయలక్ష్మి కూడా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు ఈ కారణంగానే బెంగళూరుకు వెళ్తున్నారని లోటస్పాండ్ కి వెళ్లడం ఇష్టం లేకే ఆయన బెంగుళూరు ఇంట్లో ఉంటున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ లోటస్పాండ్ వ్యవహారం ఏం జరుగుతుంది? అనేది ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా తెలియదు. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 4, 2024 7:30 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…