టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సహజంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధమైన కార్యక్రమాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారుల మార్పులు.. గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దడం వరకే చంద్రబాబు పరిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు.
అయితే.. చంద్రబాబు వచ్చీ రావడంతోనే.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తమకు అవకాశం వచ్చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. అమరావతి రాజధాని ప్రాంతంలో లే అవుట్లు వేస్తున్నారు. వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు కూడా. సీఆర్ డీయే పరిధిలోనే ఈ తతంగం కొనసాగుతోంది. దీనిపై సర్కారుకు తాజాగా ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి చంద్రబాబు రాగానే అమరావతిపై దృష్టి పెట్టారు. అక్కడ పర్యటించారు.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు వేసి విక్రయించు కోవడంతోపాటు.. చంద్రబాబు పేరును కూడా వాడేసుకుంటున్నారు. దీంతో అసలు అనుమతులు ఇంకా రాలేదన్న విషయాన్ని తెలియని కొందరు ఉద్యోగులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ కొనుగోళ్లు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. బాబు వచ్చారని.. రెచ్చిపోతే.. చర్యలు తప్పవంటూ సీఆర్‌డీయే అధికారులు తాజాగా హెచ్చరించారు.
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం సహా పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ తతంగంపై అధికారులు సీరియస్‌గా వ్యవహరించాలని నిర్ణయించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీయే అధికారులు దృష్టి పెట్టారు. ప్రొక్లైయిన్‌తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించే పనిని చేపట్టారు. వెంచర్లలో వేసిన రోడ్లను తీసేశారు. అంతేకాదు.. ఇలాంటి అక్రమ లేవుట్లను ఎవరూ నమ్మొద్దని ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు బ్రాండ్ వాల్యూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సాగుతున్న ఇలాంటి వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
This post was last modified on August 4, 2024 11:46 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…