ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు గురించి అందరికీ తెలిసిం దే. ఈ కేసులో గొడ్డలి కొనుగోలు చేయడమే కాదు.. వివేకాపై ఒక గొడ్డలి దెబ్బ కూడా వేశానని చెప్పి.. అప్రూ వర్‌గా మారిన దస్తగిరిని నిందితుల జాబితా నుంచి కోర్టు తొలగించింది. నిన్న మొన్నటి వరకు ఆయన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. తాజాగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో వివేకా దారుణ హత్య కేసు కీలక మలుపు తిరిగినట్టేనని అంటున్నారు న్యాయవాదులు.
ఎవరీ దస్తగిరి..?
కడప జిల్లా పులివెందులకే చెందిన వ్యక్తి దస్తగిరి. వివేకానంరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో.. ఈయనే ఆయన కు డ్రైవర్‌గా పనిచేశారు. వివేకా వెంటే ఉన్నారు. అయితే.. తనకు 30 కోట్ల రూపాయలు ఇస్తానని ఆశచూపి .. వివేకా హత్యలో భాగస్వామిని చేశారంటూ.. వైఎస్ భాస్కరరెడ్డి, గంగిరెడ్డిలపై ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రైవర్‌గా మారిన విషయం కూడా అందరికీ తెలిసిందే. నిజాలు చెబుతానంటూ.. అప్రూవర్‌గా మారడమే కాదు.. సాక్షిగా పరిగణించాలంటూ.. గతంలో సీబీఐ అధికారులను వేడుకోగా.. దానికి వారు అంగీకరించారు.
ఈ క్రమంలోనే సీబీఐ చార్జిషీట్‌లో ఇప్పటికే అతనిని సాక్షి
గా మాత్రమే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో ఫైలైన కేసులోనూ తనను నిందితుడిగా
కాదు.. సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరుతూ.. కోన్నాళ్ల కిందటే నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని పలు మార్లు విచారించిన కోర్టు.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అప్రూవర్‌గా మారినందున.. సీబీఐ సైతం దస్తగిరిని సాక్షిగానే పేర్కొన్నందున.. తాము కూడా.. అతనిని సాక్షి
గా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సునీత ఏం చేస్తారు?
నిందితుడి నుంచి సాక్షిగా మారిన దస్తగరి విషయంలో వివేకానందరెడ్డి కుమార్తె.. డాక్టర్ సునీత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న దస్తగిరికి ఆ బెయిల్‌ను రద్దు చేయాలని, జైలుకు తరలించాలని కోరుతూ.. గతంలోనే సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు.. సీబీఐ మాత్రం ఎలాంటి కౌంటర్ పిటిషన్ వేయలేదు. ఈ నేపథ్యంలో సునీత పిటిషన్ విచారణ దశలో ఉన్న సమయంలో అసలు దస్తగిరిని నిందితుడే
కాదని, సాక్షి
గా పరిగణిస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం.. సంచలనంగా మారింది. మరి సునీత దీనిపై న్యాయ పోరాటం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on July 26, 2024 1:10 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…