ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించండి: హైకోర్టుకు జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. హైకోర్టు మెట్లు ఎక్కారు. అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించాల‌ని కోరుతూ ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున పిటిష‌న్ దాఖ‌లైంది. దీనికి సంబంధించి ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడికి లేఖ రాశామ‌ని.. అయినా .. ఆయ‌న నుంచి ఎలాంటి స‌మాచారం రాలేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని.. త‌మ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను ఇప్పించాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్ ల‌లో గ‌తంలో జ‌రిగిన ఘ‌ట‌న‌లు.. ఈ సంద‌ర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల‌ను కూడా ఆయ‌న ఉటంకించారు.

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి 11 సీట్లు మాత్ర‌మే ల‌భించాయ‌ని పేర్కొన్న మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవ‌న్నారు. స‌భ‌లో ఉన్న‌దంతా అధికార ప‌క్ష‌మేన‌ని..మ‌రో పార్టీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలు లేర‌ని తెలిపారు. తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయ‌న్నారు. ఈ క్ర‌మంలో ఉన్న 11 మంది ప్ర‌తిప‌క్షంగా వైసీపీ త‌ర‌ఫున ఉన్నార‌ని తెలిపారు. మ‌రో పార్టీ లేనందున‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను త‌మ‌కు ఇవ్వాల్సి ఉంటుంద‌ని వివ‌రించారు. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధ‌న‌లు లేవ‌ని వివ‌రించారు.

10 శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రదాన ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్కుతుంద‌న్న వాద‌న‌లో ఎలాంటి నిబంన‌లు లేవ‌ని తెలిపారు. అధికార ప‌క్షం మిన‌హా.. మ‌రో పెద్ద పార్టీ ఉంటే.. ఆ పార్టీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని గ‌తంలో మ‌హారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సంద‌ర్భంగా ఉటంకించారు. అదేవిదంగా రాజ‌స్థాన్ అసెంబ్లీకి సంబంధించి ఇచ్చిన మ‌రో తీర్పును కూడా జ‌గ‌న్ త‌న పిటిష‌న్‌లో సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు. ఇక‌, ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో అధికార ప‌క్షం మిన‌హా.. మ‌రో పార్టీ లేద‌ని.. ఉన్న‌ది తామేన‌ని.. కాబ‌ట్టి త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇప్పించాల‌ని కోరారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోతే ఏం జ‌రుగుతుందో కూడా తెలిపారు. ప్ర‌ధాన ప్ర‌తిపక్ష హోదా ద‌క్కితే.. స‌భ‌లో ప్ర‌జ‌ల త‌ర‌ఫున మాట్లాడే అవ‌కాశం హ‌క్కుగా మారుతుంద‌ని.. మైకు ఇచ్చే పొందే అవ‌కాశం కూడా హ‌క్కుగా మారుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోతే.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశం కోల్పోతామ‌ని.. ప్ర‌జ‌లు త‌మ ను ఎన్నుకున్నందుకు ప్ర‌జాస్వామ్యంలో తమ బాధ్య‌త‌ల‌ను తాము నిర్వ‌ర్తించ‌లేక‌పోతామ‌ని.. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాను త‌మ‌కు ఇప్పించాల‌ని జ‌గ‌న్ త‌న పిటిష‌న్‌లో కోర్టును అభ్య‌ర్థించారు.