ఏపీలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి వర్సెస్ .. కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీ టీడీపీ మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న అఘాయిత్యాలను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వస్తే.. రాష్ట్రం మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనికి కౌంటర్‌గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. దిశ అంటూ.. దశ దిశలా చాటారు కదా.. ముందు అదేమైందో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలపై దారుణాలు జరిగినప్పుడు.. మీరేం చేశారో.. చెప్పాలి అంటూ.. టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్తాయిలో జరుగుతుండడం గమనార్హం.
సాయి రెడ్డి ఏమన్నారు?
కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యే మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైంది? అంటూ మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతో వైసీపీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. అయితే.. దీనికి కౌంటర్‌గా టీడీపీ దిశ చట్టాన్ని ప్రస్తావించింది. లేని చట్టాన్ని ఉందని భ్రమించేలా చేస్తూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత మంది గొంతులు కోసిందో కూడా వివరించు సాయిరెడ్డీ! అంటూ ఎదురు ప్రశ్నించింది.
This post was last modified on July 17, 2024 10:27 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…