Political News

Video: దేశంలో నిరుద్యోగం మరీ ఇంత దారుణంగా వుందా

రెండు రోజుల కిందట ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఒక ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ప్ర‌తిప‌క్షానికి మేం చెప్పాల్సిన ప‌నిలేదు. మా హ‌యాంలో ప‌దేళ్ల కాలంలో ఈ దేశంలో 8 కోట్ల మందికి ఉద్యోగాలు క‌ల్పించాం. ఈ విష‌యాన్ని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే స్ప‌ష్టం చేసింది. ప్ర‌తిప‌క్షాల నోళ్లు ఇప్పుడు తెర‌వాలి అంటూ.. వ్యాఖ్యానించారు. నిజ‌మే.. ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. గ‌త ప‌దేళ్ల‌లో 8 మందికి ఉద్యోగాలు, ఉపాధి ల‌భించింద‌ని పేర్కొంది.

కానీ.. ఏటి కేడు పెరుగుతున్న నిరుద్యోగం విష‌యంలో మాత్రం ఈ చ‌ర్య‌లు ఏ మాత్ర‌మూ స‌రిపోవ‌నేదే అటు ఆర్థిక నిపుణులు.. ఇటు ప్ర‌తిప‌క్షాలు కూడా చెబుతున్న మాట‌. అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌దే పై చేయి అన్న‌ట్టుగా.. మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌మ‌ను ఎదిరించేవారు..తమ‌ను ప్ర‌శ్నించేవారు.. పాపులు అన్న ట్టుగా కూడా మాట్లాడుతున్నారు. కానీ, వాస్త‌వం ఏంట‌నేది.. ఇప్పుడు ముంబై ఎయిర్ పోర్టు చెప్పేసింది. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది.. నిజం. నిరుద్యోగ భార‌తాన్ని.. ముంబై ఎయిర్ పోర్టు ఆవిష్క‌రించింది.

తాజాగా ముంబై ఎయిర్ పోర్టు అధికారులు పిలిచిన ఉద్యోగ భ‌ర్తీకి హాజ‌రైన వారిని చూస్తే.. దేశంలో నిరుద్యోగం ఎంత ఉంద‌నేది తెలుస్తోంది. ఇవి సాధార‌ణ ఉద్యోగాలు. అంటే.. ఒక ర‌కంగా.. మూట‌లు మోసే ఉద్యోగం(కృత‌కంగా చెబితే అంతే) అయినా.. కూడా ఉపాధి దొరికితే చాల‌న్న‌ట్టుగా.. నిరుద్యోగులు విమానాశ్ర‌యానికి పోటెత్తారు. ఎంత‌గా అంటే.. ర‌న్‌వే పై కూడా.. చేరిపోయేంత‌గా! దీంతో విమానాశ్ర‌య అధికారులు బెంబేలెత్తిపోయారు.

ఏం జ‌రిగింది?

  • ముంబై ఎయిర్‌పోర్టులో ఖాళీగా ఉన్న 2,216 ఉద్యోగాల‌ను భర్తీ చేసేందుకు ఎయిర్‌ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది.

ఏంటీ ఉద్యోగాలు..?

  • విమానం నుంచి లగేజీ దించడం, ఎక్కించడం
  • బ్యాగేజీ బెల్టులను స‌రిచూసుకోవ‌డం.
  • ఒక్కో ఎయిర్‌క్రాఫ్ట్‌లో లగేజీ, కార్గోను ప‌రిశీలించ‌డం

వేత‌నం ఎంత‌?

  • నెల‌కు రూ.20వేల నుంచి 25 వేలు
  • ఓవర్‌టైమ్ చేస్తే.. ఐదు వేలు ఎక్కువ ఇస్తారు.
  • రోజుకు 10 గంట‌ల ప‌ని వేళ‌లు

అర్హ‌త‌లు ఏంటి?

  • చ‌ద‌వ‌డం, రాయ‌డం వ‌స్తే చాలు.
  • భౌతిక ఆరోగ్యం(మూట‌లు మోసేందుకు) బాగుండాలి.

ఎలాంటి వారు వ‌చ్చారు..?

  • పోస్టు గ్రాడ్యుయేషన్‌, డిగ్రీ పూర్తి చేసినవారు
  • ఇంత‌క‌న్నా ఉన్నత చదువులు చదివిన వారు

ఎక్క‌డెక్క‌డ నుంచి వ‌చ్చారు?

  • రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడు, ఒడిశా, బిహార్‌

విమానాశ్ర‌యంలో ఏం జ‌రిగింది?

  • 2,216 పోస్టుల‌కు 32,618 మంది వ‌చ్చారు.
  • తోపులాట‌లు.. గ‌లాటాల‌తో పాటు.. ర‌న్‌వేపైకి కూడా.. వీరి క్యూ చేరిపోయింది.

నేర్పుతున్న పాఠం ఏంటి?

  • దేశంలో నిరుద్యోగం లేదు.. అంతా బాగుంద‌ని ప‌దే ప‌దే చెబుతున్న బీజేపీ పాల‌కుల‌కు నిరుద్యోగ భార‌తాన్ని క‌ళ్ల‌కు క‌డుతోంది.

This post was last modified on July 17, 2024 3:33 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago