Political News

జగన్ మళ్లీ రాడనే ధీమా వచ్చేసిందా?

తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధిని తిరోగమనం పట్టించి.. కొత్త పరిశ్రమలు రానివ్వకుండా, ఉన్నవి పారిపోయేల చేశారనే అపప్రదను మూటగట్టుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఇది కేవలం మీడియా సృష్టి మాత్రమే అనుకుంటే పొరపాటే. గత ఐదేళ్లలో జరిగిన అనేక పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. తాను పూర్తి మద్దతు పలికిన రాజధాని అమరావతి విషయంలో జగన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో.. అక్కడ మధ్యలో ఆగిన వేల కోట్ల నిర్మాణాలను చూస్తే అర్థమవుతుంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు భయపడే పరిస్థితి కల్పించారాయన. ఐతే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడి కూటమి అధికారంలోకి వచ్చినా.. పారిశ్రామికవేత్తల్లో భరోసా వస్తుందా.. ఇంకో ఐదేళ్లకు మళ్లీ జగన్ వస్తే పరిస్థితి ఏంటనే భయంతో వెనుకంజ వేస్తారనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమయ్యాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం గతంలో ఇదే రకమైన ఆందోళన వ్యక్తం చేశారు.

ఐతే ఎన్నికల్లో వైసీపీ ఎవ్వరూ ఊహించనంత చిత్తుగా ఓడిపోయిన తీరు చూస్తే జగన్ అండ్ కో తీరు పట్ల జనం ఎంతగా బెంబేలెత్తిపోయారో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ఫలితాలు చూశాక ఇన్నాళ్లూ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడ్డ వాళ్లంతా స్వేచ్ఛగా అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

అంతే కాక ఏపీ వైపు పరిశ్రమలు, వివిధ సంస్థలు చూస్తున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణానికి రూ.20వేల కోట్ల నిధులు కేటాయించడానికి అంగీకరించడం.. ఎక్స్‌ఎల్ఆర్ఐ-జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ సహా పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అమరావతిలో కార్యకలాపాలు మొదలుపెట్టడానికి సిద్ధమవుతుండడం.. ఏపీలో ఇంకా పలు చోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం.. ఇదంతా చూస్తుంటే జగన్ పార్టీ ఇప్పట్లో కోలుకోదని.. 2029లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదని అందరిలోనూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చినట్లే కనిపిస్తోంది.

This post was last modified on July 6, 2024 4:51 pm

Share

Recent Posts

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

16 minutes ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

23 minutes ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

1 hour ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

2 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

2 hours ago

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 hours ago