రేవంత్‌-బాబు చ‌ర్చ‌లు.. హీటెక్కిన పాలిటిక్స్‌

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య రాజ‌కీయాలు వేడెక్కాయి. విభ‌జ‌న హామీల ప‌రిష్కారం కోసం.. ఏపీ, తెలం గాణ ముఖ్య‌మంత్రులు ఈ నెల 6న భేటీ అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. భేటీ వ‌ర‌కు కామ‌నే అయినా.. రాజ‌కీయంగా ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యం మాత్రం అంత ఈజీకాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ స‌మాజంలో గూడుక‌ట్టుకున్న సెంటిమెంటును కాద‌ని.. అక్క‌డి ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేసే అవ‌కాశం లేదు.

ఏచిన్న పొర‌పాటు చేసినా.. తెలంగాణ స‌మాజంలో ఆయ‌న ఏకాకి అవుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు సంపాయిం చుకున్న క్రెడిట్ కూడా కోల్పోతారు. అందుకే..గ‌తంలోనే కేసీఆర్‌-జ‌గ‌న్‌లు.. రెండుసార్లు వారి వారి నివాసా ల్లో భేటీ అయినా.. ఎలాంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయారు. ప‌రిష్కారం చూపించ‌లేక పోయారు. ఇప్పుడు ఇదే స‌మస్య రేవంత్‌ను కూడా వెంటాడుతోంది. తెలంగాణ అభిప్రాయాల ప్ర‌కారం.. ఆయ‌న న‌డుచుకోవా ల్సి ఉంటుంది. సాగు, తాగు నీటి విష‌యంలో వివాదాలను ఏక‌ప‌క్షంగా ప‌రిష్క‌రిస్తే.. అది వివాద‌మే అవుతుంది.

అదేవిధంగా కేసీఆర్ హ‌యాంలో విభ‌జ‌న చ‌ట్టంలోని ఆస్తుల‌ను ఏపీకి ఇవ్వ‌కుండా.. చూశారు. ఇది రాజ‌కీ య కార‌ణ‌మే అన్న విష‌యం తెలిసిందే. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. జ‌లాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఆస్తుల పంపిణీ, విభ‌జ‌న వంటివి ఎప్పుడో చేసుకుని ఉండాలి. కానీ, దీనికి కూడా రాజ‌కీయాలు ముడిప‌డి ఉన్న నేప‌థ్యంలో నాయ‌కులు ముందుకు అడుగులు వేయ‌లే క‌పోయారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వాటిని దాటుకుని.. రేవంత్ వ్య‌వ‌హ‌రించే సాహ‌సం చేయ‌బోరు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే అనేక ఆస్తుల‌ను వ‌దులుకున్న ప‌రిస్థితి ఉంది. గ‌తంలో చంద్ర‌బాబు ఉన్న‌ప్పుడే.. ఏం చేస్తాం.,. పోనీ! అంటూ.. చాలా వ‌ర‌కు ఆస్తుల‌ను వ‌దులుకున్నారు. త‌ర్వాత వ‌చ్చిన‌.. జ‌గ‌న్‌.. కూడా ఇదే ప‌ద్ధ‌తిని అవలంభించారు. తీరా చూస్తే.. ఇప్పుడు ముఖ్య‌మంత్రులు భేటీ అవుతున్నా.. ఇది కేవ‌లం టీ -కాఫీ స‌మావేశ‌మే అవుతుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. ఇదేస‌మ‌యంలో ఈ భేటీలో రేవంత్ స‌హా చంద్ర‌బాబు తీసుకునే రాజ‌కీయ నిర్ణ‌యాల‌ను ఇరు రాష్ట్రాల మేధావులు కూడా గ‌మ‌నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వీరి భేటీ ప్రాధాన్యం సంత‌రించుకున్నా.. స‌మ‌స్య‌లు తీరే ప‌రిస్థితి మాత్రం పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.