ఏపీ డిప్యూటీ సీఎంగా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేప ట్టిన పవన్ కల్యాణ్.. తనకు అత్యంత నమ్మకస్తుడైన.. కీలక అధికారిని ఎంపిక చేసుకునే పడ్డారు.
ప్రస్తుతం పవన్‌కు లభించిన శాఖలు.. ఆయనకు మనసుకు దగ్గరగా ఉన్న శాఖలు కూడా.. చాలా పెద్దవి. వీటి విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పనిచేసేందు కు ఎంతో స్కోప్ ఉన్న శాఖలురావడం.. అదేసమయంలో సమస్యలు స్వాగతం పలుకుతున్న శాఖలు కూడా.
దీంతో నిరంతరాయంగా.. పవన్ పని చేయాల్సి ఉంటుంది. కానీ, రేపు సినిమా షెడ్యూల్ పెట్టుకుంటే.. ఆయనకు ఇబ్బంది అవుతుంది. దీంతో అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు, దూర దృష్టి, పనిచేయాలన్న కసి ఉన్న అధికారి పవన్‌కు అత్యంత అవసరంగా మారింది.
దీంతో డిప్యూటీ సీఎం పవన్ ఆదిశ గానే అడుగులు వేస్తున్నారు. కేరళ క్యాడర్ తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజపై పవన్ మనసు పెట్టుకు న్నట్టు సమాచారం. తెలుగు వాడైన కృష్ణ తేజ తన పనితీరుతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.
పైగా అవినీతి మరకలు.. ఏదో సంపాయిచుకుందామన్న ఆలోచనలు కూడా.. కృష్ణ తేజకు లేకపోవడం.. పవన్‌ను మరింత మురిసిపోయేలా చేస్తోంది. దీంతో డిప్యూటేషన్‌పై కృష్ణతేజను ఏపీకి రప్పించి ఆయనను ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా నియమించుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు అధికార వర్గాల సమాచారం.
కాగా.. కృష్ణ తేజ గతంలోనే పవన్‌ను ఒకసారి కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్.. తనకు ఇష్టమైన అధికారి, యువకుడు.. దూరదృష్టి ఉన్న ఐఏఎస్ కృష్ణతేజను ఏపీకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నారు.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు ఎలానూ మద్దతిస్తున్న నేపథ్యంలో డెప్యుటేషన్‌కు కేంద్ర హోం శాఖ కూడా.. అంగీకరించే అవకాశం మెండుగా ఉంది. దీంతో కృష్ణతేజ అంశాన్ని పవన్ కల్యాణ్ .. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారని.. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాసేందుకు సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది.
ప్రభుత్వ పరంగా కృష్ణతేజను ఏపీకి డిప్యూటేషన్ పై తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే.. అవినీతి, అక్రమాల రహితంగా తన శాఖలను అభివృద్ది చేసేందుకు పవన్‌కు అవకాశం ఏర్పడుతుందని అనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates