ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, శాస్త్ర, సాంతిక, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్య తలు చేపట్టారు.
అయితే.. ఈ సందర్భంగా రెండు ఫైళ్లపై పవన్ కల్యాణ్ సంతకాలు చేశారు. తొలి సంత కం మాత్రం తన వద్ద ఉన్న పెన్నుతోనే చేశారు.
అనంతరం.. వదినమ్మ సురేఖ ఇటీవల ప్రజెంట్ చేసిన పెన్నుతో సంతకం చేశారు. ఈ రెండు సంతకాలు చేయడానికి ముందు.. కార్యాలయంలో ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు. అనంతరం వేడ పండితుల.. ఆశీర్వ చనం అందుకున్నారు.
తర్వాత.. తన స్థానంలో కూర్చుని.. ముహూర్తం చూసుకుని మరీ పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను కలిసి అభినందించారు. పార్టీ నాయకులు విరివిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
బాధ్యతలు తీసుకున్న వెంటనే పవన్.. ఐఏఎస్, ఐపీఎస్ అదికారులతో భేటీ అవుతారు. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా.. ఎర్రచందనం పరిరక్షణ వంటివాటిపై ఆయన చర్చించనున్నారు. అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖకు చెందిన ఎన్జీవో సంఘాలతోనూ పవన్ భేటీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలు.. ప్రస్తుతం పెండింగులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు.
ఇదిలావుంటే.. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో భేటీ అవుతారు. భవిష్యత్ కార్యాచరణ సహా.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న ఎమ్మెల్సీ స్థానాలపైనా ఆయన చర్చించే అవకాశం ఉంది.
రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఒక సీటును టీడీపీ తీసుకుని.. రెండో సీటును జనసేనకు ఇస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జనసేనకు దక్కే సీటును ఎవరికి ఇవ్వాలనే విషయంపై చర్చ సాగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates