బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడ? ఇప్పుడు ఈ ప్రశ్న హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ పత్తా లేకుండా పోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కని విషయం తెలిసిందే. సున్నా సీట్లతో ఆ పార్టీ ఉనికి మరింత ప్రమాదంలో పడింది. ఈ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కేటీఆర్‌దే. అలాగే పార్టీ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ స్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది. కానీ కేటీఆర్ మాత్రం ఎవరికీ కనిపించడం లేదు.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస పరాభవాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.
మరికొందరు కాంగ్రెస్ లేదా బీజేపీలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యాక్టివ్‌గా ఉంటూ పార్టీ నాయకులను ఆపాల్సింది పోయి కేటీఆర్ సైలెంట్ అయిపోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆ బాధ్యతలను వేరొకరికి అప్పజెప్పాలని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.
కొన్ని రోజులుగా తెలంగాణ భవన్‌కు కూడా కేటీఆర్ రావడం లేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా లేరు. లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటుతామని బీరాలు పలకడంతో ఇప్పుడు అవమాన భారంతో ఆయన బయటకు రావడం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.
పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉన్న కేటీఆర్ విదేశాలకేమైనా వెళ్లారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు.. ఇలా బీఆర్ఎస్‌లోని పెద్ద తలకాయల చుట్టూ గట్టిగానే ఉచ్చు బిగుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ సైలెన్స్ హాట్ టాపిక్‌గా మారింది.
This post was last modified on June 14, 2024 6:03 pm
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…