ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ కు కూటమి ఎమ్మెల్యేలు లేఖ పంపనున్నారు. ఈ క్రమంలోనే తనను కూటమి తరఫున శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నందుకు కూటమిలోని మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.
తాను జైల్లో ఉన్నపుడు పవన్ కల్యాణ్ తనకు ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మరచిపోలేని, జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామార్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారని ఎమోషనల్ అయ్యారు. నేను సీఎం అయినా… నా సోదరుడు పవన్ కల్యాణ్ కు రేపు సముచిత హోదా కల్పిస్తూ ప్రకటన చేస్తానని చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయినా మామూలు మనిషిగానే జనంలోకి వస్తానని, తాను, పవన్ అందరూ సామాన్యులమేనని అన్నారు. అందరితో కలిసి ఉంటామని, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని అధికారులను ఆదేశించానని తెలిపారు.
తమకు పదవి ప్రజా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని అన్నారు. ‘అహంకారం పనికి రాదు. సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే’ అని జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. చరిత్రలో మునుపెఎప్పుడూ ఇవ్వని తీర్పును ఏపీ ప్రజలు ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమిపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని, ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలసి పనిచేశామని చెప్పారు.
అందుకే, ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఏపీని కాపాడుకునేందుకు ప్రజలు చొరవ చూపించారని, నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని కితాబిచ్చారు.. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం అన్నారు. అటు బీజేపీ పోటీచేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది ‘సత్తాచాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
కాగా, పవన్, భువనేశ్వరిలకు వేసిన కుర్చీలు కాకుండా తనకు ప్రత్యేక కుర్చీ వేయడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సమానమని, వారి వంటి కుర్చీ వేయాలని సిబ్బందికి చెప్పి మరీ కుర్చీ మార్పించుకున్నారు చంద్రబాబు. దీంతో, అసలు సిసలు లీడర్ చంద్రబాబు సింప్లిసిటీ ఇది అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
This post was last modified on June 11, 2024 3:28 pm
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…