కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది వీరికే

కేంద్రంలో కొత్త క్యాబినెట్ కొలువుదీరబోతున్నది.
ఇప్పటి వరకు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్,ప్రహ్లాద్ జోషి, జయంత్ చౌదరి, జితన్ రామ్ మాంఝీ రామ్‌నాథ్ ఠాకూర్, చిరాగ్ పాశ్వాన్, హెచ్‌డి కుమారస్వామి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జున్ రామ్ మేఘవాల్, ప్రతాప్ రావ్ జాదవ్, రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, రాందాస్ అథవాలే, కిరణ్ రిజుజు, రావ్ ఇంద్రజీత్ సింగ్ శంతను ఠాకూర్, మన్సుఖ్ మాండవియా, అశ్విని వైష్ణవ్ బండి సంజయ్, జి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బి ఎల్ వర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, శోభా కరంద్లాజే, రవ్‌నీత్ సింగ్ బిట్టు, సర్బానంద సోనోవాల్, అన్నపూర్ణా దేవి, జితిన్ ప్రసాద్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ష్ మల్హోత్రా, నిత్యానంద రాయ్, అనుప్రియా పటేల్,అజయ్ తమ్తా, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, సావిత్రి ఠాకూర్, రామ్ మోహన్ నాయుడు కింజరాపు, చంద్రశేఖర్ పెమ్మసాని, మురళీధర్ మొహల్, కృష్ణపాల్ గుర్జర్, గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీపాద్ నాయక్, సి.ఆర్.పాటిల్ తదితరులకు ప్రధాని కార్యాలయం నుండి సమాచారం అందినట్లు తెలుస్తుంది.

తెలంగాణ నుండి ఈటెల రాజేందర్, డీకే అరుణ, ఆంధ్రాలో పురంధేశ్వరికి అవకాశం దక్కుతుందని భావించినా ఇప్పటి వరకు వారికి ఎలాంటి సమాచారం లేదు. ఈటెలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా నియమిస్తారని ప్రచారం జరుగుతుంది.

కేరళ నుండి గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపికి కేంద్ర మంత్రి పదవి అఫర్ చేశారని, అయితే తన సినిమాల షూటింగ్ పూర్తయ్యే వరకు అవకాశం ఇవ్వాలని, తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపడతానని చెప్పినట్లు తెలుస్తుంది. ఇక తమిళనాడు కోయంబత్తూరు నుండి ఓడిపోయిన అన్నామలైని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.