సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు? ఎవరు ఓడుతున్నారనే విషయంపై తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై రాజకీయ వ్యూహకర్త.. విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్.. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
గతంలో ఆయన పలు సందర్భాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిఅధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఇదేసమయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని గెలుపును ఎవరూ ఆపలేరని కూడా చెప్పారు. ఆయనకు 400 సీట్లు రావడం కష్టమేనని.. 350 లోపు ఖచ్చితంగా వస్తాయని అన్నారు.
తాజాగా పీకే చెప్పిన గతం అంచనాల మేరకే.. జాతీయ మీడియాచానెళ్లు.. అంచనాలను ప్రకటించారు. ప్రతి సర్వే కూడా.. జాతీయ స్థాయిలో 320-350-370 మధ్య మోడీ నేతృత్వంలోన ఎన్డీయే కూటమి సీట్లు దక్కించుకుంటుందని తెలిపాయి. ఇదే సమయంలో ఇండియా కూటమికి 110-195 మధ్యలో వస్తాయని మెజారిటీ సంస్థలు చెప్పాయి. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ప్రశాంత్ కిషోర్ సీరియస్‌గా స్పందించారు.
“వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీలు, రాజకీయాలు అనే చర్చ ఎవరైనా తీసుకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పనికిమాలిన చర్చలు, నకిలీ జర్నలిస్టులు(కరణ్ థాపర్‌ను పరోక్షంగా ఉద్దేశించి), పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు(కాంగ్రెస్ నేతలు), స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో వేలు పెట్టి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు” అని ఘాటుగానే స్పందించారు..
Gulte Telugu Telugu Political and Movie News Updates