పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు విజయం దక్కించుకుంటున్నారనే విషయాన్ని పలు స్ట్రాటజీ సంస్థలు ముందస్తు ఫలితాన్ని వెల్లడించాయి. దీనిలో నమ్మదగిన సంస్థగా ఉన్న ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు..జనసేనకు జై కొట్టాయి.
జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంటు స్థానాల్లో ఈ పార్టీ విజయం దక్కించుకుంటుందని ఈ సంస్థ తెలిపింది. ప్రస్తుత పార్లమెంటు ఎమ్మెల్యే జనసేన పార్టీ మచిలీపట్నం.. కాకినాడ స్థానాలలో పోటీ చేసింది. అయితే.. ఈ రెండు కూడా జనసేన దక్కించుకుంటుందని తెలిపింది.
మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ.. వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున పోటీ చేశారు. 2019లో ఆయన వైసీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. ఆయనకు వేరే నియోజకవర్గం కేటాయించడంతో అలిగి పార్టీ నుంచి బయటకు వచ్చి..జనేసేనలో చేరారు.
ఈ క్రమంలో ఆయనకు మరోసారి మచిలీపట్నం నియోజకవర్గాన్నే కేటాయించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయనే విజయం దక్కించుకోనున్నారని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది.
ఇక, కాకినాడ నుంచి కూడా జనసేన విజయం దక్కించుకుంటుందని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. ఇక్కడ నుంచి తొలి సారి రాజకీయ అరంగేట్రం చేసిన టై టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం దక్కించుకోనున్నట్టు ఈ సర్వే తెలిపింది.
కాకినాడ నియోజకవర్గం లో ఉన్న కాపుల ఓట్లు జనసేన కు పడ్డాయి. దీంతో ఇక్కడ ఆ పార్టీ విజయం ఖాయమైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజ కవర్గాలు కూడా.. జనసేనకు అత్యంత కీలకమైన నియోజకవర్గాలు కావడం.. గమనార్హం. ఇక్కడ పవన్ కల్యాణ్ నాలుగు నుంచి ఆరుసార్లు ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ ఫలితం కనిపిస్తోందని సర్వే చెప్పడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates