మాచ‌ర్ల ఏక‌గ్రీవ‌మా? ఈసీ ఏం చేస్తుంది?

ఈ నెల 13న ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌ల్నాడు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో హింస చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. వీటిలోనూ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత హింస‌చోటు చేసుకుంది.

దీనికి సంబంధించిన ఆడియోలు.. వీడియోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నేరుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నా రెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి. ఈవీఎంల‌ను ధ్వంసం చేయ‌డం.. అడ్డు వ‌చ్చిన వారిని ఆయ‌న బెదిరించడం తెలిసిందే.

అయితే.. ఇక్క‌డ ఒక్క చోట మాత్ర‌మే కాదు.. నియోజ‌వ‌ర్గంలో చాలా చోట్ల పిన్నెల్లి సోద‌రులు.. అరాచ‌కాలు సృష్టించార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. పాల్వాయి గేటు వ్య‌వ‌హారం మాత్ర‌మే ప్ర‌స్తుతం అందుబా టులోకి వ‌చ్చింద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో అస‌లు మాచర్ల ఎన్నిక‌ల‌ను ఏక‌గ్రీవంగా ప్ర‌క‌టించాల‌నే వాద‌న వినిపిస్తోంది. టీడీపీ అభ్య‌ర్థి జూల‌కంటి బ్రహ్మానంద‌రెడ్డి ఈ వాద‌న‌ను ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్క‌డ అరాచ‌కాలు చేసిన‌.. పిన్నెల్లిని ప‌క్క‌న పెట్టాల‌ని కోరారు.

ఇదే స‌మ‌యంలో త‌న‌ను గెలుపొందిన అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని కూడా బ్రహ్మారెడ్డి కోరుతున్నారు. ఇక‌, ఈ విష‌యంపై మాజీ ఐఏఎస్ అధికారులు కూడా రియాక్ట్ అయ్యారు.

ఇక్క‌డ ఏక‌గీవ్రంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు ఎందుకంటే.. ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉన్న పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి.. స్వ‌యంగా ఈవీఎంను ధ్వంసం చేయ‌డంతోపాటు.. అధికారుల‌ను కూడా బెదిరించార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈసీ త‌గు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నారు.

వారు చెబుతున్న క‌ఠిన చ‌ర్య‌ల వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేన‌ని తెలుస్తోంది. ఇలా చేస్తే.. ఇక‌పై.. ఎక్క డా ఈవీఎంల‌ను ధ్వంసం చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న‌ది అధికారులు చెబుతున్న వాద‌న‌.

ఈవీఎంలు ధ్వంసం చేసే అభ్య‌ర్థుల‌ను అన‌ర్హులుగా ప్ర‌క‌టించి.. రెండో స్థానంలో ఉన్న‌వారిని ఎమ్మెల్యేలుగా ప్ర‌క‌టిస్తే.. ఇక‌, ఇలాంటివి అడ్డుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. అయితే.. దీనికి నిబంధ‌న‌లు ఒప్పుకొంటాయా? న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రావా? అనేది ప్ర‌శ్న‌. ఇప్పుడు ఎన్నిక‌ల సంఘం కూడా.. ఈ విష‌యంపైనే చ‌ర్చిస్తున్నట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రిఏం చేస్తారో చూడాలి.