అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ, పని చేసిందీ ఏమీ లేదు. సంబరాల రాంబాబు అనండీ, ఇంకోటనండీ.. అంబటి రాంబాబు అయితే వార్తల్లో వ్యక్తిగా వున్నారంతే.!
సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఓటమి తప్పదన్న ప్రచారం ఈనాటిది కాదు. అంబటి రాంబాబుని తప్పించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకున్నారు కూడా. కానీ, తన పరపతి అంతా ఉపయోగించి, కుల సమీకరణాల్ని చూపించి.. ఎలాగైతేనేం టిక్కెట్ సంపాదించుకున్నారు అంబటి.
అంబటి మీద టీడీపీ నుంచి కన్నా లక్ష్మినారాయణ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారం చాలా జోరుగా సాగింది. సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ, తన రాజకీయ పరపతి అంతా ఉపయోగించారు. అత్యంత వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేశారు.
టీడీపీ (కూటమి) తరఫున ప్రచారం జోరుగా సాగింది, వైసీపీ తరఫున కూడా ప్రచారం గట్టిగానే జరిగింది. కానీ, ఎలక్షనీరింగ్ దగ్గరకొచ్చేసరికి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. పైగా, వైసీపీ వ్యతిరేక ఓటు గట్టిగానే ప్రభావం చూపించింది. అన్నిటికీ మించి, అంబటి రాంబాబు మీదున్న వ్యతిరేకతా.. గట్టిగానే పని చేసింది.
పోలింగ్ పూర్తయ్యాక, తాపీగా అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. తెల్లమొహం వేశారు. ‘రీ-పోలింగ్ పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం..’ అని ప్రకటించేశారు. ఈ మనవి చేసుకోవడాల్ని కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకునే పరిస్థితి లేదు. అసలంటూ రీ-పోలింగ్‌కి ఆస్కారమే లేదని ఇప్పటికే ఈసీ స్పష్టతనిచ్చేసింది.
అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు జరిగినా, ఓవరాల్‌గా పోలింగ్ ప్రశాంతమే. ఓటమి భయంతో రీ-పోలింగ్ అడిగితే, ముందే ఓటమి ఒప్పేసుకున్నట్లవుతుందని అంబటికి తెలియకపోతే ఎలా.?
Gulte Telugu Telugu Political and Movie News Updates