సిట్టింగ్ ఎంపీ ఎందుకు అసెంబ్లీకి పోటీ చెయ్యాల్సి వచ్చింది.? ఈ ప్రశ్న కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో, అందునా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకింత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
‘వైఎస్ జగన్ తప్పు చేశారు. వంగా గీతను బలి పశువుని చేశారు. అంతా అయిపోయాక, ఇప్పుడేమో వంగా గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. ఇదేం పద్ధతి.?’ అంటూ వైసీపీకి చెందిన కాపు నేతలు కొందరు గుస్సా అవుతున్నారట.
డే వన్ నుంచీ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విషయమై వంగా గీత వెనుకంజలోనే వున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి పిఠాపురం నియోజకవర్గం మొదటి నుంచీ అనుకూలంగానే వుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నుంచి కొంత పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకత వుండొచ్చన్న ప్రచారం జరిగినా, ఆ వర్మ మొదటి నుంచీ చివరి వరకూ పవన్ కళ్యాణ్‌కి వెన్ను దన్నుగా నిలిచారు.
పిఠాపురం నియోజకవర్గంలో వంగా గీతకు మద్దతుగా మొదట్లో కనిపించిన ఎంపీ మిధున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు, ఆ తర్వాత చేతులెత్తేశారు. చివరి రోజు ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్, పిఠాపురంలో నిర్వహించినా, అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది.. అదీ అనూహ్యమైన స్థాయిలో.
పరిస్థితి అర్థమయ్యిందో ఏమో, వంగా గీత చివరి రాగం పాడేశారు.. అదీ, ఏడుపు రాగం.! ఆమె అలా ఏడుస్తోంటే, పక్కనే వైఎస్ జగన్ నవ్వుతూ కనిపించడం వైసీపీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేసింది.
వైసీపీ తరఫున పిఠాపురం నియోజకవర్గంలో 5 వేల రూపాయల వరకు నగదు, దానికి అదనంగా చీర, మద్యం బాటిళ్ళు.. ఇలాంటివి పంపకాలు జోరుగా సాగుతున్నాయ్. ఏం చేసినా, వంగా గీత పిఠాపురంలో గెలిచే అవకాశం కనిపించడంలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates