Political News

కుమారీ ఆంటీ మద్దతు ఎవరికో తెలుసా ?

కుమారి ఆంటీ. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలోనే కాదు బయట కూడా దాదాపు ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ‘మీ బిల్లు థౌజండ్. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అన్న డైలాగ్ తో ఆమె పాపులర్ అయిపోయారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ మూలంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఏకంగా పోలీసులు ఆమెను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ఆమెకు మద్దతుగా నిలవడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చి ఆమె అక్కడే ఫుడ్ స్టాల్ నిర్వహించుకునేలా అనుమతి ఇచ్చిందంటే క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఆంధ్రాకు చెందిన కుమారీ ఆంటీ ఈ నెల 13న ఎన్నికల నేపథ్యంలో తన స్వస్థలం గుడివాడలోని పెద్ద ఎరుకపాడుకు విచ్చేసి రాజకీయ ప్రచారం మొదలు పెట్టారు.

గుడివాడ శాసనసభ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు ఆమె మద్దతు పలుకుతూ గుడివాడలోని పలు వార్డులలో పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. “టీడీపీ అభ్యర్థి మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు మాదిరిగా మంచి మనసున్న వ్యక్తి అని, ఆ సినిమాలో మహేశ్‌ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నాడని” ప్రశంసలు కురిపించింది కుమారీ ఆంటీ. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చానని. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, టీడీపీ గెలిస్తేనే అది సాధ్యం అని స్పష్టం చేసింది.

గుడివాడ శాసనసభ స్థానం నుండి 2004, 2009లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచిన కొడాలి నాని 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. తిరిగి 2014, 2019లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశాడు. ప్రస్తుతం అక్కడి నుండి ఐదోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాడు కొడాలి నాని, మరి కుమారీ ఆంటీ ప్రచారం వెనిగండ్ల రాము గెలుపుకు ఎంత వరకు బాటలు వేస్తుందో వేచిచూడాలి.

This post was last modified on May 10, 2024 11:10 am

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

1 hour ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

2 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

5 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

7 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago