ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సందడి ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని టీడీపీ శ్రేణులలో ఆందోళన కలిగిస్తున్నది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు 53 రోజులు జైలులో ఉండి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.
అయితే తాజాగా చంద్రబాబు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించారని, ఆయన తనయుడు లోకేష్ మీడియాతో మాట్లాడుతూ పలుమార్లు రెడ్ డైరీ అంటూ హెచ్చరికలు చేశారని, రెడ్ బుక్ లో అధికారుల పేర్లు నోట్ చేసుకుంటున్నామని హెచ్చరికలు చేశారని, అధికారంలోకి వచ్చాక అందరి పని చెప్తాం అని అన్న నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సీఐడీ కోర్టులో పిటీషన్ వేసింది.
ఎన్నికలు మరో 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సీఐడీ పిటీషన్ కలకలం రేపుతున్నది. చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఐడీ తరపున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. లోకేష్ మాట్లాడితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించినట్టు ఎలా అవుతుందంటూ చంద్రబాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా వాదించారు. దీంతో తదుపరి విచారణ మే 7కు వాయిదా వేసిన సుప్రీం కోర్ట్. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దంటూ చంద్రబాబును ఆదేశించింది. ఈ పిటిషన్‌పై మే 7న సుప్రీం కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతున్నది అని అంధరూ ఉత్కంఠగా ఉన్నారు.