పులివెందులలో ఏం జరుగుతోంది.? కడపలో ఏం జరుగుతోంది.? కుప్పం అలాగే పిఠాపురం మీద స్పెషల్ ఫోకస్ పెట్టి, సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో పరిస్థితుల్ని పట్టించుకోకపోతే ఎలా.? ఇదీ ఇప్పుడు వైఎస్సార్సీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ.!
వాస్తవానికి పులివెందుల అసెంబ్లీ, కడప లోక్ సభ నియోజకవర్గాల్లో వైసీపీ పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే, అక్కడ వైసీపీని కాదని, ఇంకో పార్టీకి ఓటేసేంత రిస్క్ అక్కడి ఓటర్లు చెయ్యరన్నది వైసీపీ బలమైన నమ్మకం.
పులివెందులలో అయితే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదు. కానీ, ఎక్కడో చిన్న టెన్షన్. ఎందుకంటే, వైఎస్ కుటుంబంలో చీలిక వచ్చేసింది. వైఎస్ షర్మిల, కాంగ్రెస్‌లో వున్నారు. వైఎస్ విజయమ్మ, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నారు.
వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయనుంది. ఆ ఓట్లు గనుక చీలితే, వ్యవహారం బెడిసికొట్టేస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి. ఈ నేపథ్యంలోనే, వున్నపళంగా పులివెందుల, కడప నియోజకవర్గాలపై వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారట.
తొలుత కుటుంబంలోని సమస్యల్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట వైఎస్ జగన్. తన తల్లి విజయమ్మని ముందు నిలబెట్టి, కుటుంబాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వైఎస్ జగన్ ప్రయత్నాల్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే, షర్మిల విషయంలో తానేమీ చేయలేననీ, అలాగే వైఎస్ వివేకా కుటుంబం విషయంలోనూ తాను చెయ్యగలిగిందేమీ లేదని విజయమ్మ తన కుమారుడు జగన్‌కి తేల్చి చెప్పారట. ఎన్నికలకు ఇంకా సమయం వున్న దరిమిలా, అవసరమైతే ఇంకొన్ని మెట్లు దిగైనాగానీ.. పరిస్థితుల్ని చక్కదిద్దాలనే (రాజీ కుదుర్చుకోవాలనే) ఆలోచనతో వైఎస్ జగన్ వున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates