“ఏపీ సీఎం జగన్‌కు సిగ్గులేదు” అని మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఏర్పాటు చేయాల్సిన విశాఖ విజన్ సదస్సును.. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని దుయ్యబట్టారు.
“సిగ్గుంటే విజన్ విశాఖపై మరోసారి అలోచించుకోవాలి విశాఖలో పోటీ చేసిన విజయమ్మను ఇక్కడి ప్రజలు ఘోరంగా ఓడించారు. దీనికి కారణం ప్రజలు నమ్మకపోవడమే. విశాఖ ప్రజలు ఎలాంటి పార్టీని కోరుకుంటున్నారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. 2019లో ఒక్క చాన్స్ అంటే ప్రజలు నమ్మారు. అటువం టి పరిస్థితిలో విశాఖలోని నాలుగు దిక్కుల్లోనూ వైసీపీని ఓడించారు. విశాఖలోని నాలుగు దిక్కుల్లో స్థానం లేకుండా చేసిన విషయాన్ని గుర్తించుకోవాలి“ అని గంటా వ్యాఖ్యానించారు.
గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీని విశాఖ ప్రజలు గెలిపించారని, ఇది రాబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితానికి సంకేతమని గంటా వ్యాఖ్యానించారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారని, ఓటర్లను బయటపెట్టారని, ప్రలోభాలు పెట్టినా ఆఖరికి టీడీపీ మద్దతుదారైన చిరంజీవికే ఈ ప్రాంత ప్రజలు పట్టం కట్టిన విషయాన్ని గంటా గుర్తు చేశారు. ఐదేళ్ళలో విశాఖలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని గంటా ప్రశ్నించారు. ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా పెట్టలేదన్నారు.
“మద్యపాన నిషేధం, రైల్వే జోన్, ప్రత్యేక హోదా ప్రజలు అడుగుతారనే సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల తరువాత విశాఖలో ఉంటానని సీఎం చెబుతున్నారు. అది కలగానే మిగిలిపోతుంది. 2014 – 2019 మద్య కాలంలో ఐఐఎం, ఐఐటపీఈ, ఐఎస్ఆర్, నిట్ ఏర్పాటు చేశాం. ఈ తరహా ప్రతిష్టాత్మక సంస్థలను ఈ ఐదేళ్లలో ఒకటైన ఏర్పాటు చేశారా“ అని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates