ఏపీలో త్వరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, జగన్ పై ప్రజా వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందని, ఆయన పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అని, టీడీపీ-జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని టీడీపీ, జనసేన నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక, ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఐప్యాక్ మాజీ బాస్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే తేల్చి చెప్పేశారు.
హైదరాబాదులో పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్న పీకే…రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, జగన్ ఏం చేసినా ఓటమి తప్పదని పీకే చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి.
ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవని పీకే చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని పీకే అన్నారు. తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు షాకింగ్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates