రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న పార్టీలు తగ్గిపోతున్నాయి. కానీ… పైకి మాత్రం 33 శాతం రిజర్వేషన్ అమలు కావాల్సిందేనని మాటల తూటాలు పేల్చుతున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణకు వచ్చే సరికి మాత్రం.. ఇది సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండడమో.. లేక.. మహిళలకు ఇస్తే.. పురుష అభ్యర్థులకు కోపం వస్తుందనో.. కారణం ఏదైనా కూడా.. టికెట్ల విషయానికి వచ్చే సరికి మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. తాజాగా టీడీపీ-జనసేన ప్రకటించిన తొలి జాబితాలో 99 ఎమ్మెల్యే సీట్లకు అభ్యర్థును ప్రకటించారు.
మరి 33 శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పిన ఈ రెండు పార్టీలూ ఆమేరకు అమలు చేశాయా? అంటే.. లేదనే చెప్పాలి. అనేక తర్జన భర్జనలు.. కూడికలు, తీసివేతల అనంతరం.. కేవలం 18 శాతం మందికి మాత్రమే మహిళలకు టికెట్లు ఇవ్వడం గమనార్హం. ఇటీవల వైసీపీ ప్రకటించిన ఇంచార్జ్‌ల జాబితాలోనూ అన్యాయమే జరిగినా.. అక్కడ ప్రకటించిన 73 స్థానాల్లో 28 శాతం మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. దీనిని బట్టి అంతో ఇంతో వైసీపీ ప్రాధాన్యం ఇచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఇక, టీడీపీ జనసేన ప్రకటించిన జాబితాలో కేవలం 14 మంది మహిళలకు మాత్రమే చోటు దక్కింది.
ఇదీ.. మహిళల జాబితా!
అనంతపురం జిల్లా పెనుకొండ- సవిత, రాప్తాడు- పరిటాల సునీత, సింగనమల(ఎస్సీ)- బండారు శ్రావణి
కర్నూలు జిల్లా పాణ్యం- గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డ- భూమా అఖిలప్రియ
కడప జిల్లాలో కడప- మాధవిరెడ్డి
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట(ఎస్సీ)- విజయశ్రీ,
ఉమ్మడి కృష్నా జిల్లా నందిగామ(ఎస్సీ)- తంగిరాల సౌమ్య
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తుని- యనమల దివ్య
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట(ఎస్సీ)- వంగలపూడి అనిత, అరకు(ఎస్టీ)-జగదీశ్వరి.
విజయనగరం జిల్లాలో సాలూరు(ఎస్టీ)- గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం-అదితి విజయలక్ష్మి గజపతిరాజు
శ్రీకాకుళం జిల్లాలో నెల్లిమర్ల-లోకం మాధవి(జనసేన)లకు టికెట్లు కేటాయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates