తాజాగా టీడీపీ-జనసేన తొలిజాబితా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పక్షం వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంది? ఏ విధంగా స్పందిస్తుంది? ఏ కామెంట్లు చేస్తుంది? అనేది సర్వత్రా ఉత్కంఠ.. ఆసక్తి కూడా. మరి వైసీపీ ఏమందో చదివేయండి!
తాజాగా వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రకటించిన జాబితాపై రియాక్ట్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది. జనసేన అభ్యర్థుల ను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా?. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారు అని తనదైన స్టయిల్‌లో సజ్జల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. టీడీపీ నే మిగిలిన సీట్లకు కూడా పోటీ చేస్తుందని చెప్పారు.
పవన్‌కు పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు లేవు. అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాడు. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా?. సొంతంగా బలం లేదని పవన్ ఒప్పుకుంటున్నారు. పవన్ కంటే ఆయన అభిమానులను చూస్తే జాలేస్తోంది. చంద్రబాబుకు ఎందుకు సపోర్టు చేస్తున్నాడో పవన్ చెప్పలేకపోతున్నాడు. తాను పోటీ చేసే స్థానంపైన కూడా పవన్‌కు క్లారిటీ లేదు. ఎన్నో ప్రగల్బాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారు అని సజ్జల వ్యాఖ్యానించారు.
జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించిన సజ్జల.. టీడీపీ, జనసేన మిత్రపక్షాలవి దింపుడు కళ్లెం ఆశలుగా పేర్కొన్నారు. ఆశించిన సీట్లు రావనే చంద్రబాబు డ్రామాలాడున్నారని విమర్శలు గుప్పించారు. 24 అన్నారు. 5 స్థానాలే ప్రకటించారు. వీటిలో కూడా.. టీడీపీ నేతలే పోటీ చేస్తారు. మీరు చూడండి అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా మాకు ఇబ్బంది లేదని, ఈ జాబితా చూశాక.. వైసీపీ గెలుపు మరింత ఖాయమైందని వ్యాఖ్యానించారు.
టీడీపీ-జనసేకు అభ్యర్థులు లేరు!
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులను నిలబెట్టేందుకు టీడీపీ, జనసేనలకు అభ్యర్థులు లేరని సజ్జల వ్యాఖ్యానించారు. టీడీపీలో పవన్ కళ్యాణ్‌కు వైస్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే.. బెటరేమోనని వ్యాఖ్యానించారు. 24 మందితో వైసీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లోనే పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఓటమి తప్పదు అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates