టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూ డదని ఆయన వ్యాఖ్యానించారు. మరో మూడు రోజుల్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగియనుం ది. ఈ నెల 27న ఎన్నికలు కూడా జరగనున్నాయి. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి అన్నీ ఎమ్మెల్యేల కోటాలోనే ఉన్న నేపథ్యంలో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించిం ది. ఒకటి వైవీ సుబ్బారెడ్డి, రెండోది ఎస్సీ నాయకుడు గోల్ల బాబూరావు, మూడోది కూడా రెడ్డి వర్గానికే కేటాయించింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఒక అభ్యర్థిని పోటీ పెడతారని కొన్ని రోజులుగా రాజకీయ చర్చలు సాగాయి. అయితే.. తాజా గా పార్టీ కీలక నేతలతో నిర్వహించిన ప్రత్యేక భేటీలో చంద్రబాబు రాజ్యసభ ఎన్నికల గురించి చర్చించారు. అసెంబ్లీలో బలం లేకుండా.. ఎన్నికలకు వెళ్తే.. చెడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని.. పైగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నందున.. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు వెళ్తే.. మన దృష్టి మళ్లుతుందని.. వైసీపీకి ఆ ఛాన్స్ ఇవ్వరాదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ దూరం అయినట్టు స్పష్టమైంది.
ప్రస్తుతం టీడీపీ తరఫున కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే రాజ్యసభలో నేరుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ యన సభ్యత్వం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారని.. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి జై కొడతారని.. పార్టీ వర్గాలు అంచనా వేసుకున్నాయి. అదికూడా మరోసారి కనకమేడలకే అవకాశం ఇస్తారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు అసలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates