ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్యవహారంపై ఎవరికి వారు తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం బలమైన గళం వినిపిస్తోంది. ఈ సారి ఆయనకు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామని నాయకులు వ్యాఖ్యానించారు. తమను వాడుకుని వదిలేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా నియోజకవర్గంలోని పెనుగొండ మండలం, సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వ్యతిరేకంగా జత కట్టిన నాయకులు సమావేశమయ్యారు. సుమారు 100 మందికి పైగా ఉన్నవీరు.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టారు. గత ఎన్నికలలో రాజుగారికోసం.. తాము అనేక త్యాగా లు చేశామని, కానీ, తమకు నిర్బంధాలు.. పోలీసుల కేసులే ఎదురయ్యాయని వివరించారు. ఈ నేపథ్యంలో రాజుగారికి టికెట్ ఇవ్వద్దంటూ.. నాయకులు పట్టుబట్టారు.
రాజు గారికి కాకుండా.. ఎవరికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామని.. ఎట్టి పరిస్థితిలోనూ రాజుగారిని ఓడిస్తా మని ప్రతిజ్ఞ చేయడం గమనార్హం. ఏం జరిగిందంటే.. ఆచంట నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో విజ యం దక్కించుకున్న రంగనాథరాజు.. ఓ వర్గాన్ని ప్రోత్సహించారు. మరికొందరు నాయకులను పక్కన పెట్టారు. దీనిపై కొన్నాళ్లుగా నియోజకవర్గంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పడు అవికాస్తా.. రోడ్డున పడడం గమనార్హం. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates