కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాకూడదనే తాను కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించారు. ఈ సంరద్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. “కేంద్రంలో బలమైన పార్టీ రాకూడదనే కోరుకుంటున్నా. అలా వస్తే..ఏపీ సమస్యలుపరిష్కారం కావు. వారు అక్కడ బలంగా ఉంటే.. మన మీద ఆధారపడరు. దీంతో ఏ సమస్యా కూడా పరిష్కారం కాదు. అందుకే అక్కడ బలమైన పార్టీ రాకూడదని కోరుకుంటున్నా” అని అన్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికలు ముగిసి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఢిల్లీ వెళ్లిన జగన్.. అప్పట్లో అక్కడ ప్రదానిని కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అప్పుడు కూడా.. ఇదే మాట చెప్పారు. “కేంద్రంలో బలమైన పార్టీ రాకూడదని తాము కోరుకున్నాం. ఇలా వస్తే.. కేంద్రంలో వచ్చే పార్టీ మా మాట వినదు. మాపై ఆధార పడదు. అందుకే కేంద్రంలో బలమైన పార్టీ రాకూడదనే కోరుకున్నాం” అని జగన్ వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. మళ్లీ ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే..కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రబుత్వం పార్లమెంటు వేదికగా.. తాము వచ్చే ఎన్నికల్లో బలం కాదు.. అత్యంత బలంగా కేంద్రంలో వేళ్లూనుకుంటున్నామని.. తమకు 370 సీట్లు ఖాయమని.. తమ మిత్రపక్షాలతో కలుపుకుంటే..త మ బలం 400 లకు చేరుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ లోక్ సభ దద్దరిల్లేలా.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే.. ఆ మరుసటి రోజే.. ప్రధానికి దత్తపుత్రుడు అని కేంద్రంలోని మంత్రులు పేర్కొనే.. జగన్ ఇలా కేంద్రంలో బలం రాకూడదని కోరుకుంటున్నట్టు చెప్పడం గమనార్హం.
ఎవరి కోసం..
జగన్ ప్రకటన వెనుక అధికార పక్షంలో ఒక మాట..ప్రతిపక్షంలో మరో మాట వినిపిస్తోంది అధికార పార్టీ నాయకులు.. అనుకూలంగా మాట్లాడుతూ.. కేంద్రం నుంచి ఎన్నో సాధించుకోవాల్సి ఉందని.. కాబట్టి.. జగన్ ఇలా అని ఉంటారని అన్నారు. ఇక, విపక్ష నాయకులు ఇదే వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీకి మద్దతిస్తే.. లేదా మద్దతుగా మాట్లాడితే.. ఏపీలో ముస్లిం మైనారిటీఓట్లు వైసీపీకి దూరమయ్యే ప్రమాదాన్ని జగన్ గ్రహించి ఉంటారని అందుకే.. ఇలా మాట్లాడారని అంటున్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నంత మాత్రాన మన డిమాండ్లు, మన హక్కులు సాధించుకోకుండా ఎదురు చూస్తామా? అని వారు విమర్శలు గుప్పినస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates