Political News

నెల్లూరు సిటీ క‌న్ఫ‌ర్మ్‌.. రంగంలోకి నారాయ‌ణ‌

నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను మాజీ మంత్రి, కాపు నాయ‌కుడు, నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణకు ఇస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో చంద్ర‌బాబు నారాయ‌ణ‌కు దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం ద‌క్కించుకుని తీరాల‌న్న సంక‌ల్పంతో ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి ఇప్ప‌టికే రంగంలోకి దిగారు.

గ‌త ఎన్నిక‌ల్లో నారాయ‌ణ పోటీ చేసిన స్థానాన్ని ఈ ద‌ఫా కూడా ఆయ‌న‌కే ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో, అధినేత చంద్ర‌బాబు నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా అందుకున్నారు నారాయ‌ణ. దీంతో వెనువెంట‌నే ఆయ‌న ఆదివారం రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. త‌న ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి తొలిసారి పోటీ చేసిన మాజీ మంత్రి(అప్ప‌ట్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు).. స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం ఓట‌మి నుంచి గెలుపు కోసం ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.

2019 ఎన్నిక‌ల్లో పొంగూరు నారాయ‌ణ‌కు 71 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి ఇక‌, ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌కు 74 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. అంటే.. ఇద్ద‌రి మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 3 వేలు మాత్ర‌మే. అది కూడా.. ఇక్క‌డ ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది. అప్ప‌ట్లో జ‌న‌సేన త‌ర‌పున కేతంరెడ్డి వినోద్ పోటీ చేశారు. ఈయ‌న‌కు 8 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన‌-టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డంతో ఓట్లు చీలే అవ‌కాశం లేదు.

మ‌రోవైపు.. త‌న‌కు ప్ర‌తికూలంగా ఉన్న మండ‌లాల‌పై నారాయ‌ణ దృష్టి పెట్టారు. ఈ మండ‌లాల్లో టీడీపీ సానుభూతిపరులు, కేడ‌ర్‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నారు. పార్టీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం వివ‌రిస్తున్నారు. ఇక‌, ఆయ‌న సతీమ‌ణి.. ర‌మాదేవి.. ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టికే.. ఇంటింటి ప్ర‌చారంచేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు బొట్టు పెట్టి మ‌రీ.. త‌న భ‌ర్త‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు. ఇది వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది. వీటికితోడు పొత్తు కూడా క‌లిసి వ‌చ్చి.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నారాయ‌ణ గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా ఎన్నిల‌కు ముందే టికెట్ క‌న్ఫ‌ర్మ్ కావ‌డం నారాయ‌ణ‌లో సంతోషాన్ని నింపింది.

This post was last modified on February 5, 2024 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

57 minutes ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

1 hour ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

1 hour ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

3 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

3 hours ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

5 hours ago