ముహూర్తం ఫిక్స్‌.. రంగంలోకి ప‌వ‌న్‌…!

ముహూర్తం ఫిక్స్ అయింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా రంగంలోకి దిగ‌నున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో టీడీపీ తో క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న జ‌న‌సేనాని.. ఆ మేర‌కు ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పైనా ఒక లెక్క‌కు వ‌చ్చారు. ఇక‌, సంఖ్య‌, వాసి, రాసి.. అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే.. మొత్తంగా క‌లిసి పోటీ చేయ‌డం, వైసీపీని గ‌ద్దె దింప‌డం, రాష్ట్రాన్ని బాగు చేసుకోవ‌డం అనే కాన్సెప్టుతో ముందుకు సాగుతు న్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టీడీపీతో పొత్తు ఖ‌రారైంది.

అయితే.. బీజేపీ క‌లిసి వ‌స్తుందేమోన‌నే ఆలోచ‌న‌తో ఆయ‌న ఉన్నారు. ఈ విష‌యం ఇప్పటి వ‌ర‌కు తేల‌లే దు. ఇక‌పైనా తేలుతుందా? లేదా? అనేది ప‌క్క‌న పెట్టి ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి ఎన్నిక‌ల ప్ర‌చార శంఖం పూరించ‌నున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌టించ‌డంతోపాటు.. కీల‌క‌మైన కొన్ని జిల్లాల‌ను టార్గెట్ చేసుకుని అక్క‌డ ప్ర‌చారం చేయ‌నున్నారు.

వారాహి యాత్ర‌తో పాటు.. కుదిరితే.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో(కాకినాడ సిటీ వంటి క‌ఠిన‌మైన టార్గెట్‌గా భావిస్తున్న‌) పాద‌యాత్ర చేసే అవ‌కాశం ఉంది. ఈ దిశ‌గానే పార్టీ వ్యూహం రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ అయిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. తొలుత అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న యాత్ర ప్రారంభించ‌నున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా ప‌వ‌న్ పోటీ చేసేఅ వ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇక్క‌డ మొద‌లు పెట్టి ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, అనంత‌పురం, క‌ర్నూలు, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ప్రాధ‌మికంగా ప‌వ‌న్ యాత్ర‌కు రూట్ మ్యాప్ సిద్ధ‌మైంది. అయితే.. అవ‌స‌రం బ‌ట్టి ఈ మ్యాప్ మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇవ‌న్నీ.. ప‌వ‌న్ ఒక్క‌రే చేయ‌నున్న ప్ర‌చారాలు. ఇక‌, పార్టీ నాయకుల‌తో మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు కూడా ఉండ‌నున్నాయ‌ని అంటున్నారు. అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం చేసేందుకు.. మ‌రో టీంను రెడీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరిలో వారికి శిక్ష‌ణ, అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది.