వైసీపీ నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు… స్టెప్పులు వేశారు. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగ తొలిరోజు భోగిని పురస్కరించుకుని మంత్రి సొంత నియోజకవర్గం సత్తెనపల్లి లో కూడా భోగి మంటలు వేశారు. సత్తెనపల్లి గాంధీ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన భోగి మంటలను అంబటి రాంబాబు రాజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలతోపాటు.. చుట్టుపక్కల ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాంబాబు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. పైగా.. తనపై రాయించుకున్న పాటకే ఆయన యువకులతో కలిసి స్టెప్పులు వేయడం అందిరినీ ఆకర్షించింది. అంబటీ రాంబాబు.. సంబరాల రాంబా బు పల్లవితో సాగే ఈ గీతానికి రాంబాబు స్టెప్పులు వేశారు. చివరిలో కరోనా సమయంలో మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నానంటూ.. పాట ముగుస్తుంది. కాగా.. ఈ కార్యక్రమంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో రాంబాబు పాల్గొన్నారు.
గత ఏడాది కూడా భోగి పండుగ సమయంలో ఎ స్టీ సామాజిక వర్గం లంబాడాలకు చెందిన మహిళలతో కలిసి రాంబాబు స్టెప్పులు వేశారు. అప్పట్లో ఆయనపై విపరీతమైన ట్రో్ల్స్ వచ్చాయి. అయినా.. వాటిని పాజిటివ్‌గా తీసుకున్న రాంబాబు.. ఇప్పుడు ఏకంగా సొంత పాట రాయించుకుని మరీ స్టెప్పులు వేయడం.. యువతను కూడా చేరదీయడం.. పక్కా ప్లాన్‌తో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం., ఎన్నికలకు ముందు ప్రజలను మెప్పించేందుకు రాంబాబు చేయాల్సిన ప్రయత్నాలు జోరుగానే చేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates