టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాల్లో కొత్త ఒరవడిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రా.. కదలిరా! సభల్లో చంద్రబాబు ప్రసంగాలు ఆకట్టుకుంటు న్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, మేధావులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గతానికి-ప్రస్తుతానికి మధ్య ఉన్న తేడాను ఆయన విశదీకరిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోం దని అంటున్నారు.
సాధారణంగా చంద్రబాబు ప్రసంగాలను గమనిస్తే.. ఆవేశం, ఆక్రోశం కనిపించేవి. సీఎం జగన్‌పై కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. కానీ, ఎన్నికల కు ముందు నిర్వహిస్తున్న ఈ సభల్లో వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా.. ఆయన పాలన, రాష్ట్ర అభివృద్ది వంటివాటిని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇదేసమయంలో గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు.. ప్రస్తుతం పథకాలకు పోలిక పెడుతూ.. వివరిస్తున్నారు.
అదేవిదంగా తాము ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలపై వివరణకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. మాతృవందనం పేరుతోప్రతి ఇంట్లోనూ చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికీ రూ.15 000 చొప్పున ఇచ్చే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనికితోడు.. గతంలో స్థానిక ఎమ్మెల్యేల విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. ఇప్పుడు కేవలం పార్టీ విషయాన్ని, అదేవిధంగా జనసేన పొత్తు విషయాన్ని ఎక్కువగా చెబుతున్నారు.
మరీ ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ.. తీసుకువస్తున్న పథకాలను చంద్రబాబు ఎక్కువగా వివరిస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎందుకు గెలిపించాలనే విషయాన్ని ఆయన వివరిస్తున్నారు. అమరావతి రాజధాని సహా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రతి కుటుంబాన్నీ ఆర్థికంగా తీర్చది ద్దే విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, ఎస్సీ సామాజిక వర్గం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న లోపాలు.. ఎమ్మెల్యేల పనితీరు.. వంటివాటిని వివరిస్తూ.. తన ప్రసంగాల్లో కొత్తదనం ఉండేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.